కన్నీళ్లు పెట్టించిన నిద్రలేని రాత్రులు.. తల దిండు పట్టుకుని నేరుగా కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!

నవీ ముంబైలో ఒక సామాన్య మహిళ చేసిన అసాధారణ నిరసన ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వారం రోజులుగా కరెంటు కోతలతో నరకం చూస్తున్న ఆ మహిళ.. విసిగిపోయి అర్ధరాత్రి పూట తన తల దిండు పట్టుకుని నేరుగా విద్యుత్ శాఖ కార్యాలయానికే వెళ్ళింది. పదేపదే ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆమె చేసిన ఈ వినూత్న పోరాటం, ప్రభుత్వ నిత్యావసర సేవల వైఫల్యాలపై ప్రజల్లో ఉన్న అసహనాన్ని ఒక్కసారిగా బద్ధలు కొట్టింది.

కన్నీళ్లు పెట్టించిన నిద్రలేని రాత్రులు.. తల దిండు పట్టుకుని నేరుగా కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
Navi Mumbai Powercut Problems

Updated on: Jun 09, 2026 | 4:32 PM

నవీ ముంబైలో ఒక సామాన్య మహిళ చేసిన అసాధారణ నిరసన ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వారం రోజులుగా కరెంటు కోతలతో నరకం చూస్తున్న ఆ మహిళ.. విసిగిపోయి అర్ధరాత్రి పూట తన తల దిండు పట్టుకుని నేరుగా విద్యుత్ శాఖ కార్యాలయానికే వెళ్ళింది. పదేపదే ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆమె చేసిన ఈ వినూత్న పోరాటం, ప్రభుత్వ నిత్యావసర సేవల వైఫల్యాలపై ప్రజల్లో ఉన్న అసహనాన్ని ఒక్కసారిగా బద్ధలు కొట్టింది.

నవీ ముంబైలోని ఉల్వే, సెక్టార్ 8 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలు ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్నాయి. మొదటి వీడియోలో, సదరు మహిళ నిరంతర విద్యుత్ కోతల వల్ల తన మానసిక, శారీరక ఆరోగ్యం ఎంతలా దెబ్బతిందో చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె రోజువారీ జీవితం ఎంత దయనీయంగా మారిందో వివరిస్తూ.. సాధారణంగా ఆమె రాత్రి 11 గంటలకు పని ముగించుకుని ఇంటికి వస్తుందని, కానీ అప్పటికే కరెంటు పోయి తెల్లవార్లూ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మళ్లీ ఉదయం 6 గంటలకే నిద్రలేచి ఉద్యోగానికి వెళ్లాల్సి రావడంతో, వారం రోజులుగా కంటిమీద కునుకు లేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నానని అధికారుల ముందు కుమిలిపోయింది.

వైరల్ వీడియో ఇక్కడ చూడండి..

అయితే, సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది మాత్రం రెండో వీడియోనే. ఎంత వేడుకున్నా అధికారులు స్పందించకపోవడంతో, ఆమె అర్ధరాత్రి వేళ చేతిలో తల దిండు పట్టుకుని వీధుల గుండా నడుచుకుంటూ స్థానిక విద్యుత్ కార్యాలయానికి చేరుకుంది. “మా ఇళ్లన్నీ చీకట్లో మగ్గుతుంటే.. మీ ఆఫీసులో మాత్రం కరెంట్ వెలుగుతోంది. అందుకే నేను నిద్రపోవడానికి ఇక్కడికే వచ్చాను” అంటూ అధికారులపై ఆమె గుప్పించిన వ్యంగ్యాస్త్రాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

వైరల్ వీడియో ఇక్కడ చూడండి..

ఈ అసాధారణ నిరసనపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. అధికారులు వినియోగదారుల గొంతు విననప్పుడు, ఇలాంటి నిరాశే నిస్పృహగా మారి తిరుగుబాటుకు దారితీస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వందలాది మంది నవీ ముంబై నివాసితులు ఆమెకు మద్దతుగా నిలుస్తూ, తమ ప్రాంతాల్లోని విద్యుత్ కష్టాలను పంచుకుంటున్నారు. 21వ శతాబ్దంలో కూడా నమ్మకమైన విద్యుత్ సరఫరా అనేది విలాసం కాదని, అది ఒక ప్రాథమిక అవసరమని వాదిస్తూ తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోల దెబ్బకైనా విద్యుత్ శాఖ నిద్రలేస్తుందేమో చూడాలి..!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us