Viral Video: కదులుతున్న రైల్లోంచి కిందపడ్డ వృద్ధుడు.. ఆపద్భాందవుడైన పోలీస్ కానిస్టేబుల్

|

Apr 07, 2023 | 5:29 PM

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన పలువురు నెటిజన్లు పోలీస్‌ కానిస్టేబుల్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. కదులుతున్న రైలు ఎక్కేందుకు గానీ, దిగేందుకు ప్రయత్నించారదని పలువురు సూచనలు చేస్తున్నారు.

Viral Video:  కదులుతున్న రైల్లోంచి కిందపడ్డ వృద్ధుడు.. ఆపద్భాందవుడైన పోలీస్ కానిస్టేబుల్
Cop Saves Elderly Man
Follow us on

రైల్వే స్టేషన్లలో జరిగే ప్రమాదాలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో, స్పీడ్‌గా వెళ్తున్న ట్రైయిన్‌లోంచి దిగబోయి పడిపోయే ఘటనలు అనేకం చూస్తుంటాం. అయితే, ఇక్కడ కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కబోయిన ఒక వృద్ధుడు ప్లాట్‌ఫామ్‌ మధ్య గ్యాప్‌లో ఇరుక్కుపోయాడు. అది గమనించిన స్టేషన్ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఒకరు వెంటనే స్పందించి ఆ వృద్ధుడి ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డాయ్యాయి. ప్రమాద ఘటన పాల్ఘర్‌లోని వాసాయి రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

వాసాయిలో రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య గ్యాప్‌లో పడిపోయిన వృద్ధుడిని పోలీసు రక్షించాడు. విజయ్ మాలేకర్ 74 ఏళ్ల వృద్ధుడు కదులుతున్న రైలులో ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా బ్యాలెన్స్ తప్పి రైలుకు ప్లాట్‌ఫారమ్‌కు మధ్య ఉన్న గ్యాప్‌లోకి జారిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన కానిస్టేబుల్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికుడి ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్‌పీ) అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన పలువురు నెటిజన్లు పోలీస్‌ కానిస్టేబుల్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. కదులుతున్న రైలు ఎక్కేందుకు గానీ, దిగేందుకు ప్రయత్నించారదని పలువురు సూచనలు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..