Viral Video: పోలీస్ లాఠీ కావాలంటూ ముద్దు ముద్దు మాటలతో ఈ చిట్టి తల్లి మారాం చూశారా..?

|

Sep 05, 2022 | 9:22 PM

తాజాగా అలాంటి క్యూట్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో ఓ పోలీసు అధికారిణితో చిన్నారి మారాం చేయడం నెటిజన్లు ఆకట్టుకుంటుంది.

Viral Video: పోలీస్ లాఠీ కావాలంటూ ముద్దు ముద్దు మాటలతో ఈ చిట్టి తల్లి మారాం చూశారా..?
Viral
Follow us on

చిన్న పిల్లల అల్లరి పనులు ఎంతో ముద్దుగా అనిపిస్తుంటాయి. వారు చెప్పే మాటలు.. అమాయకపు చూపులు పెద్దవారి మనసులను ప్రశాంతంగా మార్చేస్తాయి. ఇక చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరికి పెదవులపై నవ్వులు రావాల్సిందే. వారు చేసే క్యూట్ పనులు ఆనందాన్ని ఇస్తాయి. గత కొద్ది రోజులుగా చిన్నారులకు సంబంధించిన ఫన్నీ వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి క్యూట్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో ఓ పోలీసు అధికారిణితో చిన్నారి మారాం చేయడం నెటిజన్లు ఆకట్టుకుంటుంది.

ముంబైలో డ్యూటీలో ఉన్న ఓ మహిళా పోలీసు వద్దకు వెళ్లిన ఓ చిన్నారి ఆమె చేతిలోని కర్రను అడుగుతుంది. అయితే ఆమె ఆ కర్రను ఇవ్వకుండా పైకి పట్టుకుంది. దీంతో ఆ అమ్మాయి అక్కడి నుంచి పక్కకు వెళ్లింది. ఆ తర్వాత ఆ పోలీసు అధికారిణి కర్రను అటు ఇటు ఊపుతూ తన ఎదుటివారితో ముచ్చటిస్తుంది. ఇంతలో ఆ చిన్నారి మళ్లీ వచ్చి తనకు ఆ కర్ర ఇవ్వమంటూ దానిని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఆ పోలీసు నవ్వుతుంది నీకెందుకు అంటూ ఆ చిన్నారితో నవ్వుతూ ముచ్చటిస్తుంది. వీరిద్దరి క్యూట్ సంభాషణకు సంబంధించిన వీడియోను కనిష్క బిష్ణోయ్ అనే ఇన్ స్టా యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.