స్నేహం గొప్పతనం అనేకసార్లు వినే ఉంటాం. ఒంటరితనంతో పోరాటానికి నేనున్నాంటూ తోడుండారు. ప్రతి ఒక్కరి జీవితంలో మఖ్యమైన వ్యక్తి ఒకరుంటారు. తన వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాలే కాకుండా.. మనసులో మెదిలే ఆలోచనలను సైతం షేరు చేసుకోవాలనిపించే వారు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారు. స్నేహం అంటే ఇచ్చి పుచ్చుకోవడం కన్నా గొప్ప బంధం అని సద్గురు చెబుతుంటారు. అయితే ఎవరు ఎవరితో స్నేహం చేస్తారు.. ఎవరెవరు ప్రాణ మీత్రులుగా నిలిచిపోతారనేది వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరి వ్యక్తిత్వాలు కలిస్తేనే వారు ప్రాణమిత్రులుగా మారిపోతుంటారు. అయితే ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదండోయ్.. జంతువులకు కూడా వర్తిస్తుంది.
రెండు వేరు వేరు జాతులకు చెందిన జంతువులు ప్రాణ స్నేహితులుగా మారుతుంటాయి. వాస్తవానికి ఒకటికి మరోకటి ప్రాణం తీసుకుని జంతువులుగా స్నేహితులుగా మారుతుంటాయి. ఉదాహరణకు కుక్క పిల్లి.. కోడి పిల్లి.. కోతి కుక్క.. ఇలా రకరకాల జంతువుల స్నేహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కానీ స్నేహం కోరి దగ్గరకు వస్తే నీతో నావల్ల కాదంటూ పారిపోయింది ఓ శునకం.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఆ వీడియోల ఓ జూలో ఉన్న తెల్ల సింహం.. అక్కడే ఉన్న కుక్క దగ్గరకు వచ్చి స్నేహం కోసం దాని కాలును తీసుకుంది. అయితే కాసేపు అలాగే నిల్చున్న కుక్క కాలును మరోసారి పట్టుకునేందుకు ట్రై చేసింది సింహాం. దీంతో వెంటనే రివర్స్ పారిపోయింది శునకం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్స్ సింహానికి కుక్క భయపడిందని.. శునకం అలసిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Anupama Parameswaran : ఎర్రచీరలో కిర్రెక్కిస్తున్న కుర్రది.. అందాల అనుపమ లేటెస్ట్ ఫొటోస్..
Rowdy Boys: సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్.. మూవీ ట్రైలర్ లాంచ్ చేసే స్టార్ హీరో ఎవరంటే..
Sonusood: కీలక నిర్ణయం తీసుకున్న సోనూసూద్.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..