Lion vs giraffe fight video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యకరంగా, భయంకరంగా ఉంటాయి. అయితే.. వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. వీటిలో కొన్ని క్యూట్‌గా అనిపిస్తే.. మరికొన్ని భయాన్ని కలిగిస్తుంటాయి. వాస్తవానికి అడవి జంతువుల మధ్య జరిగే పోటాపోటీ యుద్ధాలను మనం చాలానే చూసుంటాం.. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వన్యప్రాణులకు సంబంధించిన చాలా వీడియోల్లో ప్రమాదకరమైన జంతువులు ఇతర జంతువులపై దాడి చేయడం మీరు తప్పక చూసే ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో సింహం జిరాఫీపై దాడి చేసింది. ఓ సింహం జిరాఫీపై దూసుకెళ్లింది. అయితే అక్కడ చాలా సింహాలు ఉన్నాయి. జిరాఫీపై ఓ సింహం దాడి చేసిన తీరు కళ్లకు కట్టినట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. అటవీ ప్రాంతంలో జిరాఫీ హాయిగా నిలబడి ఉన్నట్లు మీరు చూడవచ్చు. అప్పుడే సింహాల మంద అక్కడికి వచ్చి దానిని తమ వేటగా మార్చకునేందుకు సన్నాహాలు ప్రారంభిస్తుంది. అయితే.. మందకు నాయకత్వం వహించే ఓ సింహం ఏకంగా జీరాఫీపై ఎక్కి దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో జిరాఫీ కూడా తనను తాను రక్షించుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ వీడియో క్లిప్‌లో చూడవచ్చు.. జిరాఫీ సింహంతో ఎలా పోరాడుతుందో చూడవచ్చు. తన పై ఉన్న సింహాన్ని కిందపడేసి జిరాఫీ.. సింహాల మంద నుంచి చాకచక్యంగా తప్పించుకుంది.
వైరల్ వీడియో..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చాలా మంది నెటిజన్లు దీనిపై పలు రకాల కామెంట్లు సైతం చేస్తున్నారు. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో Wild_animals_creation అనే యూజర్ షేర్ చేయగా.. వేలాది మంది నెటిజన్లు వీక్షించారు.
Also Read: