Viral Video: నీటిలో చిక్కుకున్న జింక.. సింహాల గుంపుకు సింగిల్‌గా దొరికేసిందిగా.. కట్ చేస్తే సీన్ సితారే.!

అడవిలో చట్టాలు చాలా డిఫెరెంట్‌గా ఉంటాయి. అక్కడ బ్రతకాలంటే.. ప్రతీ రోజూ పోరాడాల్సిందే. క్రూర జంతువులు ఎలప్పుడూ...

Viral Video: నీటిలో చిక్కుకున్న జింక.. సింహాల గుంపుకు సింగిల్‌గా దొరికేసిందిగా.. కట్ చేస్తే సీన్ సితారే.!
Lion
Follow us

|

Updated on: Feb 08, 2022 | 9:33 PM

అడవిలో చట్టాలు చాలా డిఫెరెంట్‌గా ఉంటాయి. అక్కడ బ్రతకాలంటే.. ప్రతీ రోజూ పోరాడాల్సిందే. క్రూర జంతువులు ఎలప్పుడూ సాధు జంతువులను ఎరగా చేసుకుని తమ ఆకలిని తీర్చుకుంటాయి. ఇక వాటి నుంచి తప్పించుకునేందుకు సాధు జంతువులు ఎప్పటికప్పుడు పోరాటం సాగిస్తూనే ఉంటాయి. ఇక దీనికి అడ్డం పట్టే విధంగా ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సింహం వేట ఎట్టుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ జంతువునైనా వేటాడటానికి సింహాలు ఫిక్స్ అయితే.. అంత ఈజీగా వదిలిపెట్టవు. ఒక్క ఉదుటున ఆ జంతువు తన కంటి చూపు నుంచి దూరం కాకముందే పట్టుకుంటాయి. అయితే ఇక్కడ ఏకంగా ఓ సింహాల గుంపే ఉంది. కానీ వేటలో ఓడిపోయాయి. ఓసారి లుక్కేయండి.

వైరల్ వీడియో ప్రకారం.. నదిలో చిక్కుకున్న జింకను ఓ సింహం తన పదునైన దవడలతో పట్టుకుంటుంది. అది తన పట్టు నుంచి తప్పించుకోకుండా బలంగా పట్టుకోవడానికి దానిపైకి ఎక్కుతుంది. ఇక జింక.. సింహం ఇచ్చే నొప్పిని భరిస్తూ.. ఎలాగైనా తప్పించుకోవాలని.. తన ప్రాణాలను రక్షించుకోవాలని సర్వశక్తులు ఒడ్డిస్తుంది. నీటిలోనే ముందుకు ఎగురుతూ.. ఎగురుతూ.. సింహం పట్టు సదిలిపోయేలా చేస్తుంది. అక్కడ నుంచి తప్పించుకుంటుంది. చివరికి సింహం తన ఓటమిని ఒప్పుకుంటూ వెనుదిరుగుతుంది. కాగా, ఈ వీడియోను ట్విట్టర్‌లో ఓ నెటిజన్ షేర్ చేయగా.. నెటిజన్లు వరుసపెట్టి లైకులు, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.