Viral Video: అమ్మబాబోయ్.. మృగరాజు ఏశాలు మామూలుగా లేవుగా.. ఆడ సింహాంతో పరాచికాలు.. అంతలోనే ఫసక్..

|

Sep 17, 2022 | 10:18 AM

తాజాగా సింహం సరదా వీడియో చక్కర్లు కొడుతుంది. ఎప్పుడూ సీరియస్‏గా వేటాడే సింహం.. ఇందులో మాత్రం సరదాగా మరో ఆడ సింహాన్ని ఆటపట్టిస్తుంది.

Viral Video: అమ్మబాబోయ్.. మృగరాజు ఏశాలు మామూలుగా లేవుగా.. ఆడ సింహాంతో పరాచికాలు.. అంతలోనే ఫసక్..
Viral Video
Follow us on

అడవికి రారాజు అయిన సింహాన్ని చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. సింహం అలికిడి వినిపిస్తే భయంతో పారిపోతుంటాయి మిగతా జంతువులు. అంతేకాదు.. సింహం వేట ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసిన విషయమే. ఇటీవల సోషల్ మీడియాలో సింహం వేటకు సంబంధించిన వీడియోస్ తెగ వైరలవుతున్నాయి. కానీ తాజాగా సింహం సరదా వీడియో చక్కర్లు కొడుతుంది. ఎప్పుడూ సీరియస్‏గా వేటాడే సింహం.. ఇందులో మాత్రం సరదాగా మరో ఆడ సింహాన్ని ఆటపట్టిస్తుంది. నిద్రిస్తున్న ఆడ సింహం వద్దకు ఎంతో నెమ్మదిగా.. కాస్త శబ్ధం కూడా రాకుండా వెళ్లింది. కానీ చివరకు అడ్డంగా బుక్కయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

అడవిలోని ఓ దారిలో ఆడ సింహం ప్రశాంతంగా నిద్రిస్తుంది. ఇది గమనించిన ఓ సింహం దానిని మేల్కోల్పడానికి నెమ్మదిగా..చిన్న శబ్దం కూడా రాకుండా.. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లింది. నోటితో దానిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. వెంటనే మేల్కోన్న ఆడ సింహం తిరిగి దాడి చేస్తుంది. పెద్దగా గర్జిస్తూ.. పైపైకి వెళ్లడంతో సింహం వెనక్కు తగ్గింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.