Viral Video: బలవంతుడిదే రాజ్యమైనా.. ఆహారమైనా.. చిరుత సింహం ఆహారం కోసం వేట వీడియో వైరల్

|

Aug 29, 2022 | 1:52 PM

ఇతర జంతువులన్నీ చిరుతపులి చురుకుదనం ముందు సరిపోవు. తన ఆహారం కోసం వేటాడే విధానం భిన్నం. చాలా నిర్దాక్షిణ్యంగా ఇతర జంతువులను చంపుతుంది.. అయితే సింహం విషయానికి వస్తే..

Viral Video: బలవంతుడిదే రాజ్యమైనా.. ఆహారమైనా.. చిరుత సింహం ఆహారం కోసం వేట వీడియో వైరల్
Viral Video
Follow us on

Viral Video: అడవిలో క్రూరజంతువులు అంటే పులి, సింహం, చిరుతపులి తరచుగా ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటాయి. అయితే అవి ఎప్పుడు దాడి చేసుకున్నా అవి ప్రమాదకరంగా ఉంటాయి. జీవన్మరణ మధ్య పోరాటంగా పోరాడతాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో అరుదైన పోరాట దృశ్యం చూస్తున్నాం. అడవి రాజు సింహం ఆహారం కోసం చిరుతపులిపై దాడి చేసింది. అంతేకాదు చిరుత సంపాదించుకున్న ఆహారాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది. అదే సమయంలో చిరుతపులి తన ముందు జరుగుతున్నదంతా చూస్తూ ఉండిపోయింది.

ఇతర జంతువులన్నీ చిరుతపులి చురుకుదనం ముందు సరిపోవు. తన ఆహారం కోసం వేటాడే విధానం భిన్నం. చాలా నిర్దాక్షిణ్యంగా ఇతర జంతువులను చంపుతుంది.. అయితే సింహం విషయానికి వస్తే.. అన్ని జంతువులూ వేట విషయంలో దిగదుడుపే.. అడవి రాజు సింహానికి భిన్నమైన పాదాలు ఉంటాయి. ఒక్కసారి గర్జిస్తే అడవి అంతా వణికిపోతుంది. తాజాగా సింహం తన బలంతో చిరుతపులి నుండి తన ఆహారాన్ని లాక్కుంది.

షాకింగ్ వీడియో ఇక్కడ చూడండి:

ఇవి కూడా చదవండి

వీడియోలో చిరుతపులి అడవి పందిని వేటాడినట్లు మీరు చూడవచ్చు. అంతేకాదు చిరుత తన ఆహారాన్ని తినే పని మొదలు పెట్టిన సమయంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. అక్కడకు వచ్చిన సింహం దృష్టి.. చిరుతపులి వేటపై పడింది. చిరుత నుంచి తన ఎరను లాక్కోవడానికి ప్రయత్నించింది. సింహం.. వెళ్లి నేరుగా చిరుతపులి దగ్గరకు వెళ్లి.. అడవి పందిపై తనది అని నొక్కి చెప్పింది. చిరుతపులి మొదట కొద్దిగా కోపం చూపిస్తుంది. అయినప్పటికి సింహాన్ని చూసి పక్కకు తప్పుకుని తన ఆహారాన్ని దానికి ఇచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..