రూల్స్ అంటే రూల్స్.. ఫోటో తీస్తున్న వ్యక్తికి షాక్ ఇచ్చిన సింహం.. వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే

|

Sep 02, 2024 | 9:32 AM

ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.  మనుషులై ఉండి కూడా ఇలా నిబంధనలు పాటించకపోవటంతో, నోరులేని క్రూర జంతువు అయి ఉండి.. ఆ యువతకు జూ నియమాలను గుర్తు చేసిందంటున్నారు.  అలాంటి పర్యాటకులను కఠినంగా శిక్షించాలి అంటున్నారు.

రూల్స్ అంటే రూల్స్.. ఫోటో తీస్తున్న వ్యక్తికి షాక్ ఇచ్చిన సింహం.. వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే
Lion Insists Visitor
Follow us on

జూలో జంతువులను చూసేందుకు వెళ్ళే చాలా మంది అక్కడి జంతువులతో అతి చేస్తుంటారు. వాటిని విసిగించేలా ప్రవర్తిస్తుంటారు. అక్డకి నిబంధనలను ఉల్లంఘిస్తూ… జంతువుల ముందు సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం వంటి చిరాకు పుట్టించే పనులు చేస్తూ వారితో పాటు అక్కడి పర్యాటకులను కూడా ఇబ్బందులకు గురి చేస్తుంటిరు. ఇప్పుడు మరోసారి జూకు వెళ్లిన ఇద్దరు యువకులు సింహాల ఎన్‌క్లోజర్‌ దగ్గర వీరంగం సృష్టించారు. ఓ యువకుడు సింహానికి ఏదో తినిపిస్తుండగా, మరో యువకుడు ఎన్‌క్లోజర్‌లో చేయి పెట్టి తన మొబైల్‌తో వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. ఆ తరువాత ఏం జరిగిందో మీరు ఊహించలేదు..సోషల్ మీడియాలో ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పులి, సింహం వంటి జంతువులను చూసేందుకు వచ్చిన కొందరు యువకులు జూలో బీభత్సం సృష్టించారు. సందర్శకులు జూలో జంతువులకు ఆహారం ఇవ్వడం నిషేధించబడింది. అలాగే, నిషేధిత రేఖను దాటడం, వాటికి అడ్డుగా వేసిన కంచె సమీపంలోకి వెళ్లడం కూడా అనుమతించరు. అయితే ఈ యువకులు ఈ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టేశారు. నేరుగా సింహాల దగ్గరికి వెళ్లి వీరంగం సృష్టించారు. ఒక యువకుడు ఎన్‌క్లోజర్ కింద ఉన్న గ్యాప్ ద్వారా సింహానికి ఆహారం ఇచ్చాడు. సింహం ఆ ఆహారం తిన్నది. ఈ ఘటనను మరో యువకుడు తన మొబైల్‌లో రికార్డ్ చేశాడు. ఎన్‌క్లోజర్‌లో తన రెండు చేతులు పెట్టి మొబైల్ లో వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. యువకుడి చేతి నుంచి ఒకటి రెండు సార్లు ఆహారం తిన్న తర్వాత ఆ సింహం వీడియో తీస్తున్న యువకుడి దగ్గరికి వచ్చింది.

ఇవి కూడా చదవండి

యువకుడి చేతి పంజా వేసింది ఆ పెద్దపులి.. అతనిపై గర్జించలేదు, భయపెట్టలేదు. కానీ, ఇలా చేయటం తప్పు అన్నట్టుగా అతని చేతులను తీసి బయటకు నెట్టేసింది. అతడు తన చేతులు బయటకు తీసిన తర్వాత సింహం అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఇతర పర్యాటకులు తమ సెల్‌ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో ఏ జూకు సంబంధించినదో తెలియదు గానీ, వీడియో మాత్రం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో చూడండి..

ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.  మనుషులై ఉండి కూడా ఇలా నిబంధనలు పాటించకపోవటంతో, నోరులేని క్రూర జంతువు అయి ఉండి.. ఆ యువతకు జూ నియమాలను గుర్తు చేసిందంటున్నారు.  అలాంటి పర్యాటకులను కఠినంగా శిక్షించాలి అంటున్నారు. నిబంధనలను ఉల్లంఘించడం వల్ల జంతువులకు ప్రమాదాలు కలిగించడమే కాకుండా తమను తాము ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అంతిమంగా, జంతువు నుంచి ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు వాటిని బలియాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..