Viral Video: స్నేహమంటే ఇదేరా.! సింహాన్ని కొమ్ములతో కుమ్మేసిన గేదెలు.. చూస్తే ఆశ్చర్యపోతారు..

|

Aug 04, 2021 | 9:48 AM

అడవికి రాజైన సింహం వేట మాములుగా ఉండదు. దానిని ఆమడదూరం నుంచి ఏదైనా జంతువు చూసిందంటే.. ప్రాణాలు కాపాడుకునేందుకు..

Viral Video: స్నేహమంటే ఇదేరా.! సింహాన్ని కొమ్ములతో కుమ్మేసిన గేదెలు.. చూస్తే ఆశ్చర్యపోతారు..
Lion
Follow us on

అడవికి రాజైన సింహం వేట మాములుగా ఉండదు. దానిని ఆమడదూరం నుంచి ఏదైనా జంతువు చూసిందంటే.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టాల్సిందే. సింహం అధిపత్యం అలాంటిది మరి. ఇక సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు కోకొల్లలు. ప్రతిదీ వైరల్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఈ వీడియోలో ఓ గేదెపై సింహం మెరుపు దాడి చేస్తోంది. దాని దవడలతో ఆ గేదెను గట్టిగా కొరుకుతూ గాయపరుస్తుంది. పాపం ఆ గేదె నొప్పిని భరించలేక ఆర్తనాదాలు చేస్తుంది. ఇక అప్పుడే తన మిత్రుడిని కాపాడుకోవడానికి మిగతా గేదెల మంద ఒక్కసారిగా సింహంపైకి దూసుకొస్తాయి. ప్రాణభయంతో మృగరాజు ఆ గేదెను వదిలేసి పారిపోతుంది. అయితే సింహం కొంతదూరం వెళ్లి మళ్లీ ఛాన్స్ కోసం అక్కడే నక్కి ఉన్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు.

ఇదిలా ఉంటే సింహం చేత గాయపడిన గేదె తీవ్రమైన నొప్పితో బాధపడుతూ అక్కడ నుంచి కదల్లేకపోతుంది. మిగతా గేదెల మంద దాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ షాకింగ్ వీడియోను @iftirass అనే ట్విట్టర్‌ పేజీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. క్షణాల్లో అది కాస్తా వైరల్‌గా మారింది.

Also Read:

భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!

కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!