Lion and warthog fight: మీరు సింహాలను కచ్చితంగా చూసే ఉంటారు. అడవిలో అన్ని జంతువులు ఉన్నా.. వాటిని మాత్రమే అడవికి రారాజు (కింగ్ ఆఫ్ ది జంగిల్) అని పిలుస్తుంటారు. అవి చాలా శక్తివంతమైనవి.. అంతేకాకుండా ప్రమాదకరమైనవి. అడవిలో ఉండే జంతువులన్నీ వాటిని చూసి భయపడుతుంటాయి. చిరుతపులి లాంటి క్రూరమైన జంతువులతోపాటు జింక వంటి చిన్న జంతువులు కూడా సింహాలకు భయపడతాయి. సింహాన్ని చూస్తే మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మనుషుల్లాగే సింహాలకు కూడా క్షణికావేశంలో దాడి చేసే సామర్థ్యం ఉంటుంది. అందుకే ఈ ప్రమాదకరమైన జంతువు నుంచి ప్రజలు దూరంగా ఉండాలని తరచూ పేర్కొంటుంటారు. అదే సమయంలో అడవి పందులు కూడా ప్రమాదకరమైనవే. ఒక్కోసారి అడవుల్లోంచి బయటకు వచ్చి జనావాసాలకు వస్తున్నాయంటే.. అందరూ అలర్ట్ అవుతారు. అయితే.. సింహాలను చూసి అడవి పందులు చాలాసార్లు పారిపోయినప్పటికీ.. ఇక్కడ అలా జరగలేదు. అడవి పందే సింహానికి చుక్కలు చూపించింది. తాజాగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా (social media) లో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో.. అడవి పంది సింహంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. సింహం.. పంది దాడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండటాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. దీనిలో సింహంపై పంది దాడి చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో సింహానికి ఏం చేయాలో అర్ధం కాక.. వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సింహాన్ని చూడగానే మిగిలిన జంతువులు వెంటనే పారిపోతుండగా.. పంది దానితో పోరాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని పలవురు నెటిజన్లు పేర్కొంటున్నారు.
వైరల్ వీడియో..
ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో lion_lovers3 అనే యూజర్ షేర్ చేసింది. దీనిని ఇప్పటివరకు 6 లక్షల 17 వేలకు పైగా వీక్షించగా.. 9 వేల మందికి పైగా లైక్ చేశారు. దీంతోపాటు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: