అడవిలో నివసించే చిరుతలు కొన్నిసార్లు గ్రామాలు, పట్టణం వంటి ప్రదేశంలోకి ప్రవేశిస్తాయి. జనావాసాల్లో చేరిన అవి ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తుంటాయి. పలు సందర్భాల్లో వాటికి ఎదురుపడ్డ వారిపై దాడులు చేస్తుంటాయి. అతి కష్టం మీద అటవీశాఖ అధికారులు వాటిని పట్టుకుని అడవుల్లోకి వదిలేస్తుంటారు. ఇటీవల గ్రామం పక్కనే ఉన్న హైవే రోడ్డుపైకి చిరుతపులి ప్రవేశించింది. ఆ క్రమంలోనే ఆ రోడ్డుపక్కనే గడ్డి మేస్తున్న ఆవుపై దాడికి కుట్ర పన్నింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
నిజానికి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యూజర్ షేర్ చేశారు. ఒక సాయంత్రం వేళ రోడ్డు పక్కన ఆవు మేత మేస్తూ కనిపించింది. ఒక చిరుత ఆవు వెనకాలే పొంచివుంది. అదును చూసి దాడి చేసేందుకు వేచి చూస్తోంది. చిరుత నక్కి చూస్తున్న సంగతి ఆవుకు కనపడలేదు.
ఇంతలోనే ఒక ప్రకాశవంతమైన కాంతి ఆ రెండింటిపై పడుతోంది. వెలుతురును బట్టి చూస్తుంటే అదేదో వాహనానికి సంబంధించినదిగా కనిపిస్తుంది. మరి కొద్ది క్షణాల్లోనే ఆవుపై చిరుత దాడి చేయాల్సిన సమయంలో ఎదురుగా వస్తున్న కాంతికి భయపడి చిరుత కాస్త బెదురుకుంది. ఆవు కళ్ల ముందు నుంచే చిరుత తన ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీసింది. వెలుతురును చూసిన చిరుతపులి అడవిలోకి పరుగులు తీసింది.
అంతలోనే ఎదురుగా వచ్చిన చిరుత దూరంగా పారిపోవటం ఆవు చూసింది. అప్పుడు దానికి కూడా భయం మొదలైంది. కానీ, అప్పటికే చిరుత చాలా దూరం వెళ్లిపోవడంతో ఆవు తిరిగి తన కడుపునింపుకునే పనిలో పడింది. అలా ఏదో కాంతి ఆవు ప్రాణాలు కాపాడింది. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సర్వత్రా వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.