కర్ణాటకలో షిర్సి తాలూకాలోని కాగేరి గ్రామంలోని ఎంపీ విశ్వేశ్వర్ హెగ్డే ఇంటి ఆవరణలో చిరుత పులి కలకలం రేపింది.ఇంట్లోకి ప్రవేశించిన చిరుత, కుక్కను పట్టుకోవడానికి యత్నించింది. అయితే కుక్కు దాని నుంచి తప్పించుకుంది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డవగా సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఇంటి ప్రాంగణాన్ని పరిశీలించారు. షిర్సి తాలూకా పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో చిరుతలు దర్శనమివ్వడంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
A leopard entered the Kageri residence of MP Vishweshwar Hegde in Sirsi. The incident took place while Vishweshwar Hegde was at his Kageri house. pic.twitter.com/XXoqAImEzb
ఇవి కూడా చదవండి— Abubakkar Siddeek H (@siddiq0098) January 14, 2025
మైసూరులోని ఇన్ఫోసిస్ ప్రాంగణంలో గత 10 రోజులుగా చిరుతపులిని గుర్తించే ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. అదే కారణంతో ఇన్ఫోసిస్ క్యాంపస్‌లోని ఉద్యోగులకు కూడా వర్క్‌ఫ్రంహోమ్ కేటాయించారు. అలాగే మైసూర్‌లోని ఇన్ఫోసిస్ ప్రాంగణంలో ఒకరి చుట్టూ ఒకరు తిరగకూడదని కూడా ఆదేశాలు అందాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..