ఈ దునియాలో బేబీ కేర్ సెంటర్లను ఎన్నో చూశాం.. వ్యసనాలకు బానిసైన వారిని తిరిగి సాధారణ మనుషులుగా తీర్చిదిద్దే రిహాబిలిటేషన్ సెంటర్లను చూశాం.. ఎవరూ లేని అనాథల కోసం అనాథాశ్రయాలను చూశాం.. వృద్ధుల బాగోగులు చూసుకునే వృద్ధాశ్రమాలనూ చూశాం.. మరి హస్బెండ్ కేర్ సెంటర్లను ఎప్పుడైనా చూశారా? పోనీ కనీసం విన్నారా? అయితే, ఇప్పుడు ఆ సెంటర్లను కూడా చూసి తరించండి..
బేబీకేర్ సెంటర్ మాదిరిగానే.. హస్బెండ్ కేర్ సెంటర్ ఏర్పాటైంది. అంటే ఇక్కడ భర్తలను ఏదో చంటి పిల్లల మాదిరిగా చూస్తారనుకోకండి. వాళ్ల ఇష్టానికి వాళ్లను వదిలేస్తారు. వాళ్ల ఎంజాయ్ వాళ్లను చేయ్ అంటారు. అయితే, ఇలా చేసి.. వారి భార్యలకు ఫ్రీడమ్ ఇస్తారన్నమాట.
అవును, చాలా మంది భార్యలు ఇంటి పని చేసి, ఆఫీస్ వర్క్ చేసి, బిజినెస్ చేసి అలసిపోతుంటారు. కాస్త రిలాక్స్ అవ్వాలని ఆకాంక్షిస్తారు. అయితే, భర్తలను ఒంటరిగా వదిలెయ్యలేక, తమ వెంట తీసుకెళ్లలేక ఇబ్బంది పడుతుంటారు. ఇక మరికొందరు భర్తలైతే.. భార్యల వెంటే వెళ్తుంటారు. ఇంట్లో ఉండటం బోరింగ్‌గా భావించి వారితో షాపింగ్‌కి వెళ్తారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే నయా ఐడియాకు తెరలేపారు కొందరు వ్యక్తులు. ఆ ఐడియా నుంచే ‘హస్బెండ్ కేర్ సెంటర్’ కి పురుడుపోసుకుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
ఈ హస్బెండ్ కేర్ సెంటర్ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దానిని చూసిన ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. వెంటనే షేర్ చేశారు. దాంతో అది మరింత వైరల్ అయ్యింది. ఇంతకీ ఆ బోర్డులో ఏముందో తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న ఈ హస్బెండ్ కేర్ సెంటర్ బోర్డుపై ఏముందంటే.. ‘మీకంటూ ప్రశాంతంగా గడపటానికి టైమ్ కావాలా? కాసేపు రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారా? ఒంటరిగా షాపింగ్ చేయాలనుకుంటున్నారా? మరేం పర్వాలేదు.. మీ భర్తను మా వద్ద వదిలేయండి.. ఆయన గారిని బంగారంలా మేము చూసుకుంటాం. మీరు జస్ట్ ఆయన తాగే డ్రింక్స్‌కి పేమెంట్ ఇస్తే చాలు’ అంటోంది హస్బెండ్ కేర్ సెంటర్.
Innovation is not just creating new products. It’s also about creating entirely new use-cases for an existing product category! Brilliant. ? pic.twitter.com/8rDMI91riJ
— anand mahindra (@anandmahindra) April 28, 2023
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..