భారత్‌లో టాలెస్ట్ కుటుంబాన్ని చూశారా.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు ఎక్కే అవకాశం
మనుషులు ఆరు ఫీట్ల హైట్ ఉంటేనే వారి దిక్కు అదో రకంగా చూస్తుంటారు. అలాంటిది ఏడు ఫీట్లకు పైన ఉంటే.. కుటుంబానికి కుటుంబం మొత్తం ఏడు ఫీట్లు ఉంటే ఇంకేముందు అదో రికార్డే. అలాంటి రికార్డ్ క్రియేట్ చేసిన కుటుంబమే కులకర్ణిది. పూణె నగరానికి చెందిన కులకర్ణిల కుటుంబం మొత్తానికి మొత్తం దాదాపు ఏడు ఫీట్ల హైట్‌తో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. 52 ఏళ్ల శరద్ కులకర్ణి 7 అడుగుల 1.5 అంగుళాల ఎత్తు. శరద్ కులకర్ణి భార్య సంజోత్ 46 ఏళ్ల వయస్సు. ఆమె ఎత్తు 6 అడుగుల 2.6 అంగుళాలు. ఇక వారి కుమార్తెలు..

మనుషులు ఆరు ఫీట్ల హైట్ ఉంటేనే వారి దిక్కు అదో రకంగా చూస్తుంటారు. అలాంటిది ఏడు ఫీట్లకు పైన ఉంటే.. కుటుంబానికి కుటుంబం మొత్తం ఏడు ఫీట్లు ఉంటే ఇంకేముందు అదో రికార్డే. అలాంటి రికార్డ్ క్రియేట్ చేసిన కుటుంబమే కులకర్ణిది. పూణె నగరానికి చెందిన కులకర్ణిల కుటుంబం మొత్తానికి మొత్తం దాదాపు ఏడు ఫీట్ల హైట్‌తో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. 52 ఏళ్ల శరద్ కులకర్ణి 7 అడుగుల 1.5 అంగుళాల ఎత్తు. శరద్ కులకర్ణి భార్య సంజోత్ 46 ఏళ్ల వయస్సు. ఆమె ఎత్తు 6 అడుగుల 2.6 అంగుళాలు. ఇక వారి కుమార్తెలు, 22 ఏళ్ల మృగ, 16 ఏళ్ల సన్యా వరుసగా 6 అడుగుల 1 అంగుళాలు, 6 అడుగుల 4 అంగుళాలు. ఈ కుటుంబం మొత్తం ఎత్తు 26 అడుగులు.
శరద్ కులకర్ణి, సంజోత్‌లు 1988లో వివాహం చేసుకన్నారు. భారతదేశంలో ఎత్తైన జంటగా ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు ఆ జంటను వరించింది. ఇప్పటి వరకు కాలిఫోర్నియాలోని స్టాక్టన్‌కు చెందిన వేన్, లారీ హాల్‌క్విస్ట్ జంట 13 అడుగుల 4 అంగుళాల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన జంటగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. అయితే కాలిఫోర్నియా జంట కన్నా కులకర్ణి జంట రెండు అంగులాలు ఎక్కువే ఉండటంతో తాజాగా ఈ జంట గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కే అవకాశం ఉంది.
ఎత్తు వల్ల తాము నిరుత్సాహపడ్డాము. సమాజంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నాము. కానీ, ఇలా మాకు గుర్తింపు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని కులకర్ణి కుటుంబం అంటోంది. కులకర్ణి టీనేజర్‌గా 7 అడుగులు ఎత్తుకు చేరుకున్నప్పుడు, అతను తన శక్తిని క్రీడలలోకి వినియోగించారు. చివరికి తన దేశం కోసం బాస్కెట్‌బాల్ ఆడటం మొదలుపెట్టాడు. కానీ శ్రీమతి కులకర్ణి ఎలాంటి గుర్తింపు పొందకుండా ఆమె నివసించే మారుమూల గ్రామంలో ఇమడటానికి చాలా కష్టపడింది.
భారతీయ వివాహ వ్యవస్థలో పురుషుడి కంటే స్త్రీ ఎత్తుగా ఉండటాన్ని చాలావరకు ఇష్టపడరు. సంజోత్‌ను తన భాగస్వామిగా దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని కులకర్ణి చెబుతుంటాడు. ఒక సాయంత్రం ముంబైలోని ఒక వీధిలో కులకర్ణి అమ్మమ్మ సంజోత్‌ను చేసి పెళ్లి ఫిక్స్ చేసిందట. అప్పటికే కులకర్ణి హైట్‌కు తగ్గ వధువు కోసం వెతికీ వెతికీ అలసిపోయారు. ఎట్టకేలకు సంజోత్ దొరకడంతో పెళ్లి చూపులు, పెళ్లి వెంటవెంటనే జరిగిపోయాయి. ఒక సంవత్సరం తర్వాత లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని భారతదేశంలోనే అత్యంత ఎత్తైన వివాహిత జంటగా ప్రకటించింది.
ఇక వారి ఇంటిని అవసరాలకు అనుగుణంగా మార్చారు, అన్ని తలుపు ఫ్రేములను 6 అడుగుల నుండి 8 అడుగులకు పెంచారు. వారు పడకలు, వార్డ్‌రోబ్‌లు, వంటగది అల్మారాలు మరియు టాయిలెట్ ఎత్తుతో సహా వారి ఫర్నిచర్‌ను మొత్తం వారికి హైట్‌కు తగ్గట్లు మార్చేశారు. అయితే, వారు ప్రజా రవాణాకు బదులుగా స్కూటర్లలో ప్రయాణిస్తుంటారు. విమాన ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ముందు సీటు లేదా ఎమర్జెన్సీ డోర్ పక్కన సీటును రిక్వెస్ట్ చేస్తారట. ఇప్పుడు, వారి ఇద్దరు ఎదిగిన కుమార్తెలు మ్రుగ, సాన్యతో కలిసి, ప్రపంచంలోనే ఎత్తైన కుటుంబం అయ్యే అవకాశం లభిస్తుందని వారు ఆశిస్తున్నారు.