నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వచ్చి చేరుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు తెగ ఆకట్టుకుంటాయి. కొన్ని వీడియోలు మాత్రం వణికిస్తుంటాయి. తాజాగా ఈ కోవకే చెందిన ఓ వీడియో నెట్టింట్లో సందడి చేస్తుంది. భారీ సైజున్న పామును మరోపాము మిగేస్తున్న వీడియోని చూసిన జనాలు.. షాకవుతున్నారు. ఈ క్రమంలో ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తూ, తెగ వైరల్ చేస్తున్నారు. యూఎస్‌లోని జార్జియా ఈ వీడియో తీశారు. 80 ఏళ్ల టామ్ స్లాగ్లే.. విషపూరితమైన రాటిల్ స్నేక్‌ను మింగేస్తున్న కింగ్ స్నేక్‌ను గుర్తించాడు. ఈ క్లిప్‌ను జార్జియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ (DNR) పోస్ట్ చేసింది. దీంతో వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించారు. ఈ వీడియోకు కామెంట్లు, లైక్‌లు చేస్తున్నారు. ‘రాటిల్‌స్నేక్ ఇప్పుడే భోజనం ముగించినట్లు కనిపిస్తోంది’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
DNR ప్రతినిధి న్యూస్‌వీక్‌తో మాట్లాడుతూ, కింగ్‌స్నేక్ సాధారణంగా కుందేళ్ళు, తాబేళ్లు గుడ్లు, తెరచాపలు, ఇతర పాములను తింటుందని చెప్పారు. విషపూరిత పాములను చంపి వాటిని తినడంలో కింగ్‌స్నేక్ ప్రసిద్ధి చెందింది. అదే మీరు ఈ వీడియోలో చూస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.