King Cobra: ఇంట్లో నుంచి బయటకు రావడానికి మొండికేసిన 16 అడుగుల కింగ్ కోబ్రా.. అటవీ సిబ్బంది అష్టకష్టాలు.. వీడియో వైరల్..

కింగ్ కోబ్రా ను ఇంటి నుంచి బయటకు తీసే ప్రక్రియలో చెమటలు కక్కారు. ఇద్దరు వ్యక్తులు పాము పట్టే కర్రతో కింగ్ కోబ్రాను ఇంటి లోపల నుండి బయటకు తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు.. అయితే ఆ నాగుపాము బయటకు రావడం లేదు.. అతి కష్టం మీద కింగ్ కోబ్రాను బయటకు తీశారు. 

King Cobra: ఇంట్లో నుంచి బయటకు రావడానికి మొండికేసిన 16 అడుగుల కింగ్ కోబ్రా.. అటవీ సిబ్బంది అష్టకష్టాలు.. వీడియో వైరల్..
Snake Video

Updated on: Jun 17, 2023 | 10:00 AM

వేసవి వచ్చిందంటే చాలు ఎండ వేడికి తట్టుకోలేక పాములు బొరియల నుంచి బయటకు వస్తాయి. అయితే అటవీ ప్రాంతం రోజు రోజుకీ జనావాసాలుగా మారుతున్న నేపథ్యంలో బొరియల నుండి బయటకు వచ్చిన పాములు తరచుగా ఇళ్లల్లో ప్రవేశిస్తాయి. ముఖ్యంగా  ఇంటి పరిసరాల్లో అటవీప్రాంతం లేదా చెట్లు, మొక్కలు ఎక్కువగా ఉంటే పాములు వంటి విష జంతువుల సమస్యను ఎదుర్కోవల్సి ఉంటుంది. అసలు పాములు అంటే చాలు.. అవి విషపూరితం అయినా కాకున్నా ప్రజలు భయబ్రాంతులకు గురవుతారు. వీలైనంత దూరంగా పరిగెడతారు. మరి అలాంటిది తాచు పాము ఇంట్లో చొరబడితే.. ఆ ఇంటి సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించి చూడండి.  ప్రమాదకరమైన కింగ్ కోబ్రాకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఖచ్చితంగా మీకు గూస్‌బంప్స్ ఇస్తుంది.

ఒక పెద్ద కింగ్ కోబ్రా ఇంట్లోకి ప్రవేశించింది. దానిని ఇంటి నుంచి బయటకు తీయడానికి ఇంటి సభ్యులు  అటవీ శాఖ అధికారులను ఆశ్రయించారు. వారు కూడా కింగ్ కోబ్రా ను ఇంటి నుంచి బయటకు తీసే ప్రక్రియలో చెమటలు కక్కారు. ఇద్దరు వ్యక్తులు పాము పట్టే కర్రతో కింగ్ కోబ్రాను ఇంటి లోపల నుండి బయటకు తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు.. అయితే ఆ నాగుపాము బయటకు రావడం లేదు.. అతి కష్టం మీద కింగ్ కోబ్రాను బయటకు తీశారు.  ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని అల్మోరాలోని చౌము గ్రామంలో జరిగినట్లు తెలుస్తోంది. ఓ ఇంట్లోకి చేరిన 16 అడుగుల పొడవు గల కింగ్ కోబ్రా స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. నాగపాముని బయటకు తీసే సమయంలో పరిసరాల్లో ఒక ఆవు, కుక్క కూడా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @Singh99_ అనే IDతో షేర్ చేశారు. గో శాల దగ్గర అటవీ శాఖ 16 అడుగుల విషపూరితమైన కింగ్ కోబ్రాను పట్టుకుంది’ అనే శీర్షిక జత చేశారు. అంత పెద్ద పామును చూడగానే మనుషులే కాదు జంతువుల పరిస్థితి కూడా ఎలా ఉంటుందో ఊహకు అందనిది అని చెప్పవచ్చు.

కింగ్ కోబ్రాను నాగుపాము అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే అతి విషపూరిత పాముల్లో ఒకటి. దీని  పొడవు 5.6 మీటర్ల వరకు ఉంటుంది.  భారతదేశంలో ఈ కింగ్ కోబ్రా భారీ సంఖ్యలో ఉంటాయన్న సంగతి తెలిసిందే..

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..