Viral Video: వేటాడటం జంతువుల సహజలక్షణం.. కానీ తమజాతి వాటిని అవే వేటాడటం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ పాములు మాత్రం తమజాతిని వేటాడుతూ ఉంటాయి. మామూలుగానే పామును చూస్తే పరిగెత్తుతాం.. అదే పాము వేటాడేటప్పుడు చూస్తే ఇంకేమైనా ఉందా.. గుండె జారిపోతుంది. సహజంగా పాములు చిన్న చిన్న జీవులను(ఎలుకలు, కప్పలు) వాటిని వేటాడుతాయి. పెద్ద పెద్ద కొండ చిలువ వంటివి కాస్త పెద్ద జంతువులను ఆహారంగా తీసుకుంటాయి. అయితే కొన్ని పాములు ఇతర పాములను వేటాడి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఈ వీడియో దానికి సంబంధించిందే.. పాముల్లో ప్రమాదకరమైనది త్రాచుపాము దీనినే కొందరు నాగు పాము అంటారు. త్రాచుపాము ఎక్కువగా భారత దేశ అడవుల్లో కనిపిస్తూ ఉంటాయి.
నాగుపాము దాడి చాలా ప్రమాదకరమైనది, దాని దాడి నుండి ఎవరూ తప్పించుకోలేరు అంటుంటారు. నాగుపాము దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంటాయి. త్రాచు పాము దాడి ఎంత భయంకరంగా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఈ వీడియోలో ఒక పాము వెళుతూ ఉండగా.. అప్పటికే కాపుకాసిన నాగుపాము దానిని వెనక నుంచి దాడి చేసింది. అయితే ఆ పాము కూడా కింగ్ కోబ్రాతో పోరాడటానికి ప్రయత్నిస్తుంది. త్రాచుపాములాంటి చురుకైన పాము ముందు ఇంకేదైనా పాము ఎక్కడ నిలబడబోతోంది.? అంతే, నాగుపాము తన నోటితో పామును గట్టిగా నొక్కి, కాసేపు అటూ ఇటూ తిప్పి చివరకు మింగేసింది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
King cobra is hunting for another snake pic.twitter.com/8nsLfnnlIH
— मनीष Anand, Pacemaker expert (@ManeeshAnand1) February 14, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :