భారీ వర్షాలకు పాములు బయటకి వస్తున్నాయి. ఇళ్లల్లో దూరి జనాల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పాముల భయంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఓ త్రాచుపాము జనాన్ని వణికించింది. అర్ధరాత్రి పాము ఇంట్లోకి చొరబడి ఇంట్లోవాళ్లను పరుగులు పెట్టించింది. స్నేక్ క్యాచర్ వచ్చి పామును పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
అమలాపురం రూరల్ మండలం బండారులంకలోని చొల్లంగి శేఖర్ బాబు అనే వ్యక్తి ఇంట్లోకి భారీ త్రాచుపాము చొరబడింది. ఇంట్లోని ఓ మూల నుంచి పాము బుసకొట్టే సౌండ్ రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత శబ్దం వచ్చిన దగ్గరికి వెళ్లి చూడగా గోధుమ రంగులో ఉన్న త్రాచుపాము కనిపించింది.
దీంతో వారు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. దీనితో ఇంట్లోవాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాలు, తుప్పలో ఉండే పాములు జనవాసాల్లోకి చేరి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
Also Read
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చెట్టుపై 11 అడుగుల భారీ పాము.. షాకైన స్థానికులు..
కొంచెం థ్రిల్.. మరికొంచెం ఆత్రుత.. ఈ ఫోటోలో పాము దాగుంది.. దాన్ని కనిపెట్టండి చూద్దాం.!
37 నిమిషాల బ్యాటింగ్.. 453 స్ట్రైక్ రేట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.!
ఈ ఫోటోలో చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. టాలీవుడ్‌ను ఏలుతోంది.. ఈమెవరో గుర్తుపట్టారా!