Viral Video: మనసును హత్తుకుంటున్న చిన్నోడు.. గొర్రెపిల్లను తల్లితో కలపడానికి విశ్వప్రయత్నాలు.. చివరకు..

|

Jun 08, 2022 | 6:32 PM

నిర్మాణుష్యమైన ప్రదేశంలో ఓ చిన్న గొర్రెపిల్ల తన తల్లి నుంచి తప్పిపోయింది. ఇది గమనించిన ఓ చిన్న పిల్లోడు.. గొర్రెపిల్ల తల్లిని వెతకడానికి సహాయం చేశాడు..

Viral Video: మనసును హత్తుకుంటున్న చిన్నోడు.. గొర్రెపిల్లను తల్లితో కలపడానికి విశ్వప్రయత్నాలు.. చివరకు..
Viral
Follow us on

సాధారణంగా చిన్నపిల్లలు చేసే పనులు చూస్తుంటే తెగ ముచ్చటేస్తుంది. అమాయకపు మాటలు.. అల్లరి పనులు నవ్వులు తెప్పిస్తుంటాయి. ముఖ్యంగా జంతువులతో కలిసి పిల్లలు చేసే అల్లరి గురించి తెలిసిందే. ఇంట్లో ఉండే కుక్క పిల్లలతో చాలా సులభంగా కలిసిపోయి అల్లరి చేస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ తెగ్ వైరల్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఓ చిన్నోడు మాత్రం చిన్న గొర్రెపిల్లను తన తల్లితో కలిపేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు.. చివరకు ఈ గొర్రెపిల్లను తన తల్లి చెంతకు చేర్చాడు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో నిర్మాణుష్యమైన ప్రదేశంలో ఓ చిన్న గొర్రెపిల్ల తన తల్లి నుంచి తప్పిపోయింది. ఇది గమనించిన ఓ చిన్న పిల్లోడు.. గొర్రెపిల్ల తల్లిని వెతకడానికి సహాయం చేశాడు.. గొర్రెపిల్లతోపాటు అరుస్తూ.. తల్లి గొర్రె ఉన్నవైపు పరుగులు పెట్టాడు. అతని వెనకాలే గొర్రెపిల్ల కూడా పరుగులు పెట్టింది. గొర్రెపిల్ల గొంతు విన్న తల్లి గొర్రె వీరిద్దరి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చింది. చివరకు గొర్రెపిల్ల తన తల్లిని కలుసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆ చిన్నారి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వీడియోను మీరు చూసేయ్యండి.

ఇవి కూడా చదవండి