Viral Video: ద్యావుడా.. పిల్లలను స్కూల్‌ని తీసుకెళ్లేందుకు తుపాకి పట్టిన తండ్రి.. కారణం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

|

Sep 17, 2022 | 9:16 AM

Kerala Stray Dogs: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కుక్కకాటు కేసులు భారీగా నమోదవుతున్నాయి.  ముఖ్యంగా లక్నో, ముంబై, ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, కాన్పూర్, కేరళ, తమిళనాడులో కుక్క కాటు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

Viral Video: ద్యావుడా.. పిల్లలను స్కూల్‌ని తీసుకెళ్లేందుకు తుపాకి పట్టిన తండ్రి.. కారణం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే
Follow us on

Kerala Stray Dogs: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కుక్కకాటు కేసులు భారీగా నమోదవుతున్నాయి.  ముఖ్యంగా లక్నో, ముంబై, ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, కాన్పూర్, కేరళ, తమిళనాడులో కుక్క కాటు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీని కారణంగా  వీధి కుక్కలు కంటపడితేనే వణికిపోతున్నారు ఆయా నగరాల్లోని ప్రజలు. ఢిల్లీ, నోయిడాల్లో పెంపుడు జంతువుల రిజిస్ట్రేషన్‌నకు సంబంధించి ప్రశ్నలు లేవనెత్తడం అక్కడి ప్రజల్లో కుక్కలు పట్ల ఉన్న భయానికి సంకేతంగా భావించవచ్చు. ఈనేపథ్యంలో వీధి కుక్కల బారి నుంచి తన పిల్లలను రక్షించుకునేందుకు ఒక తండ్రి ఎస్కార్టుగా మారిపోయాడు. ఎయిర్‌ గన్ పట్టుకుని నిరంతరం వారిని పహారా కాస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా ఆశ్చర్యానికి గురై కామెంట్స్ చేస్తున్నారు.ఈ షాకింగ్ వీడియోలోని వ్యక్తి పేరు సమీర్‌. కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన వాడు. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. ఈనేపథ్యంలో ఎయిర్ గన్‌ సహాయంతో తన పిల్లలను క్షేమంగా పాఠశాలకు తీసుకెళ్లడం మనం చూడవచ్చు. వీడియోలో అతను తుపాకి పట్టుకుని నడుస్తూ.. వీధికుక్కలు దాడి చేస్తే కాల్చివేస్తానని చెప్పడం కనిపిస్తుంది.

కాగా తన పిల్లలను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఎయిర్‌ గన్‌తో తిరుగుతున్నట్లు సమీర్‌ తెలిపాడు. తన కూతురు చదువుతున్న పాఠశాలలో ఓ విద్యార్థిని కుక్క కాటుకు గురైందని, దీంతో మదర్సాకు వెళ్లాలంటేనే విద్యార్థినులు భయపడుతున్నారని పేర్కొన్నాడు. కాగా ఇటీవల కోజికోడ్‌లో అరకినార్ గ్రామంలో వీధి కుక్కలు 12 ఏళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేశాయి. కుక్క దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ గ్రామంలో ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురిపై వీధి కుక్కలు దాడి చేశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..