ఆ చెట్టును కౌగిలించుకుని మహిళ నిరసన.. 72 గంటల పాటు నిద్రాహారాలు మానేసి రికార్డు..!

కెన్యాలో పర్యావరణ కార్యకర్త ట్రంఫెనా ముతోని అడవుల నరికివేతకు నిరసనగా 72 గంటల పాటు చెట్టును పట్టుకుని ప్రపంచ రికార్డు సృష్టించారు. నిద్ర, విశ్రాంతి లేకుండా ఆమె చేసిన ఈ పోరాటం యువతలో పర్యావరణ సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసింది. అటవీ నిర్మూలన, మృగాల సంహారం వంటి సమస్యలపై ఈ నిరసన ఎలాంటి మార్పు తెస్తుందో చూడాలి.

ఆ చెట్టును కౌగిలించుకుని మహిళ నిరసన.. 72 గంటల పాటు నిద్రాహారాలు మానేసి రికార్డు..!
Kenyan Woman Hugs Tree 72 Hours

Updated on: Dec 14, 2025 | 5:19 PM

కెన్యాలోని న్యారీ కౌంటీలో పర్యావరణ కార్యకర్త ట్రంఫెనా ముతోని, అడవుల నరికివేతకు నిరసనగా 72 గంటల పాటు ఒక చెట్టును పట్టుకుని నిలబడి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ సమయంలో ఆమె నిద్రపోలేదు, విశ్రాంతి తీసుకోలేదు. యువత పర్యావరణ సంరక్షణ అవసరాన్ని తెలుసుకోవాలని ఆమె కోరుకున్నారు. ఈ నిరసన కెన్యాలో అడవుల నరికివేత, మృగాల సంహారం వంటి సమస్యలపై ఎలాంటి మార్పుకు దారితీస్తుందో చూడాలి.

అయితే, గతంలో ముథోని 48 గంటల పాటు చెట్టును కౌగిలించుకుని నిలబడి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆమె తన రికార్డును తానే బ్రేక్‌ చేశారు. ఇందుకోసం ఆమె నైరీ పట్టణంలోని ప్రభుత్వ ప్రాంగణంలో ఒక స్థానిక చెట్టును ఎంచుకున్నారు. చెట్టును పట్టుకుని నిరంతరాయంగా 72 గంటల పాటు ఆమె అలాగే, నిలబడి ఉన్నారు. వాతావరణ మార్పు, అటవీ నిర్మూలన వల్ల కలిగే ప్రమాదం గురించి అవగాహన పెంచుకోవాలని ఆమె కోరారు. ఆమె దృఢ నిరసనకు ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో స్పందన వచ్చింది. చాలా మంది ఆమెకు మద్ధతుగా నిలుస్తున్నారు.

ఆఫ్రికన్ దేశాలు కార్బన్ ఉద్గారాలను అత్యల్ప స్థాయిలో కలిగి ఉన్నాయని, కానీ వాతావరణ మార్పుల వల్ల కలిగే కొన్ని చెత్త ప్రభావాలను భరించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..