Viral: వంటగదిలో భారీ శబ్దాలు.. ఏంటా అని చూసిన స్థానికులకు ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి..

|

Jul 15, 2022 | 12:45 PM

ఓ ఇంటి వంటగదిలో నుంచి భారీ శబ్దాలు రావడాన్ని స్థానికులు గమనించారు. వారికి ఏదో తేడాగా అనిపించింది...

Viral: వంటగదిలో భారీ శబ్దాలు.. ఏంటా అని చూసిన స్థానికులకు ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి..
Representative Image
Image Credit source: Representative Image
Follow us on

ఓ ఇంటి వంటగదిలో నుంచి భారీ శబ్దాలు రావడాన్ని స్థానికులు గమనించారు. వారికి ఏదో తేడాగా అనిపించింది. ఇంతకీ ఆ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయా అని చూడగా వారికి గట్టి షాక్ తగిలింది. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటంటే.?

వివరాల్లోకి వెళ్తే.. మైసూర్ సమీపంలోని కామెగౌడనహళ్లి‌లో మంజు నాయక్ అనే వ్యక్తి తన ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఎన్నో నెలల నుంచి నెమళ్ళను పెంచుకుంటున్నాడు. ప్రతీ రోజూ అతడి ఇంటి నుంచి వింత శబ్దాలు వస్తుండటంతో.. ఇరుగుపొరుగు వారు అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోందా అని చూశారు. అనేక నెమళ్ళను తన ఇంట్లో పెంచుకున్తున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే మొబైల్ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు.

పక్కా సమాచారంతో విజిలెన్స్ అధికారులు, అటవీశాఖ బృందం మంజు నాయక్ ఇంటిపై దాడులు నిర్వహించారు. అతడి ఇంట్లో దొరికిన పెద్ద పెద్ద నెమళ్ళను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద మంజు నాయక్‌పై కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు.. అతడ్ని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కాగా, 1972లో భారత ప్రభుత్వం నెమలిని జాతీయ పక్షిగా గుర్తించింది. అయితే కొంతమంది దుండగులు నెమలి పించం, మాంసం కోసం వాటిని వేటాడుతుంటారు. మంజు నాయక్ కూడా ఆ కోవకు చెందిన వ్యక్తి అయి ఉండొచ్చునని.. అసలు తాను ఎందుకు నెమళ్ళను ఇంట్లో పెంచుకుంటున్నాడు.? వన్యప్రాణులను వేటాడే ముఠాతో సంబంధాలు ఉన్నాయా.? అనే కోణాల్లో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం…