Man Lives Forest: మోగ్లీ, టార్జాన్ వంటి సినిమాలు చూసి అడవుల్లో అన్ని సంవత్సరాలు ఎలా ఉంటారా.? అని అనుకుంటాం. కానీ రియల్ లైఫ్‌లో ఇలా అడవుల్లో నివసించి బయటకు వచ్చిన వారిని చూసి ఆశ్చర్యపోతుంటాం. ఇప్పుడు అలాంటి వ్యక్తికి సంబంధించిన ఓ స్టోరీనే.. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 17ఏళ్లుగా అడవిలోనే ఉంటూ.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్నాడు.
కర్నాటకకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి.. 17ఏళ్లుగా అడవిలోనే జీవిస్తున్నాడు. ఇక్కడ ఇంకో విచిత్రమేమిటంటే.. ఈ కారడవిలో ఓ చిన్నపాటి గుడిసె వేసుకుని, అందులో అంబాసిడర్ కారును ఉంచి, అందులోనే నివాసం ఉంటున్నాడు చంద్రశేఖర్.
అయితే నెక్రల్ కెమ్‌రాజే అనే గ్రామంలో చంద్రశేఖర్‌కు 1.5ఎకరాల పొలం ఉండేది. ఆ పొలంలోనే పంటను పండించుకుంటూ జీవించేవాడు. అదే సమయంలో పొలంలో పంటను పండించేందుకు ఓ బ్యాంక్ నుంచి 40వేల బ్యాంక్ లోన్ తీసుకున్నాడు. కానీ తిరిగి చెల్లించలేక, తన పొలంను వేలం వేసి, వచ్చిన డబ్బుతో బ్యాంక్ లోన్ క్లీయర్ చేశాడు. అనంతరం చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు తనకు.. ఆశ్రయం ఇచ్చేందుకు కూడా నిరాకరించడంతో.. ప్రశాంత జీవితం బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన అంబాసిడర్ కారును తీసుకుని, ఓ అడవి ప్రాంతంలోకి వెళ్లి, ఆ కారులోనే జీవిస్తున్నాడు చంద్రశేఖర్.
ప్రకృతి ఒడిలో ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నానని తెలిపాడు చంద్రశేఖర్. అయితే భారీ గడ్డంతో, కేవలం ఒక్క షర్ట్‌తో పాటు ఓ టవాల్‌ను ధరించి, అడవిలో జీవిస్తున్నాడు చంద్రశేఖర్. తాను చనిపోయే వారకు ఈ అడవిలోనే ఉంటానని, ఈ కారే నా ఇళ్లు నవ్వుతూ చెప్పుకొచ్చాడు. తన చిన్న తనంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు తెచ్చుకుని, మీడియాకు చెప్పుకుని తెగ నవ్వేశాడు చంద్రశేఖర్. అయితే కర్ణాటకలో ఇప్పుడున్న పెద్దపెద్ద పొలిటికల్ లీడర్లు ఒక్కప్పుడు తన క్లాస్ మెంట్స్ అని చెప్పుకొచ్చాడు. వాళ్లతో కలిసి తాను సెకండ్ క్లాస్ వరకు చదువుకున్నానని తెలిపాడు.
Also read:
Petrol Diesel Price: దూకుడుమీదున్న పెట్రోల్,డీజిల్.. రోజు రోజకు పెంచుతూ పోతున్న కంపెనీలు..
Viral Video: దొంగకే షాకిచ్చిన మహిళ.. టెక్నాలజీతో చెక్.. వీడియో
Cars: పండుగ వేళ కారు కొందామని చూస్తున్నారా? ప్రజలు ఎక్కువ ఇష్టపడే ఐదు కార్లు ఇవే..