Viral: సీక్రెట్‌గా భర్త ఆ యవ్వారం.. డౌట్ వచ్చి.. భార్య ఏం చేసిందో తెలిస్తే కళ్లు తేలేస్తారు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భార్యాభర్తల మధ్య అనుమానం కాస్తా పెనుభూతంగా మారింది. తనపై భార్యపై ఉన్న అనుమానంతో ఓ భర్త చేయకూడదని పని చేస్తే.. దానికి జవాబుగా ఆమె.. అతడ్ని చితక్కొట్టింది. చివరికి భయంతో భర్త పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. నా భార్య నుంచి నన్ను కాపాడండి మహాప్రభు.. అంటూ పోలీసులను వేడుకున్నాడు. చివరికి భార్యాభర్తలను పోలీసులు కౌన్సిలింగ్ చేసి.. రాజీ కుదిర్చారు.

Viral: సీక్రెట్‌గా భర్త ఆ యవ్వారం.. డౌట్ వచ్చి.. భార్య ఏం చేసిందో తెలిస్తే కళ్లు తేలేస్తారు
Trending

Updated on: Mar 08, 2025 | 6:50 PM

కాన్పూర్‌లోని బితూర్ ప్రాంతంలో ఒక వ్యక్తి తన భార్య మొబైల్‌లో కాల్ రికార్డింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. ఈ విషయం భార్యకు తెలియగానే, ఆమె కోపంతో భర్తపై చపాతీల కర్రతో దాడి చేసింది. దెబ్బలు తట్టుకోలేకపోయిన భర్త.. సరాసరి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని.. తనను తన భార్య నుంచి కాపాడండి అంటూ వేడుకున్నాడు. చివరికి భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు పోలీసులు.

ఇది చదవండి: ఈ ఫోటోలో దాగున్న పిల్లులను కనిపెట్టగలరా.? గుర్తిస్తే మీరు తోపులే మావ

మంధానలోని ఒక కర్మాగారంలో పనిచేసే వ్యక్తి తన భార్యతో కలిసి స్థానికంగా అద్దెకు నివసిస్తున్నాడు. అతను ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు, అతని భార్య మొబైల్‌లో ఎవరితోనో మాట్లాడుతోందని అనుమానపడ్డాడు. తనకు తెలియకుండా భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని భావించాడు. దీంతో సదరు వ్యక్తి తన ఫ్రెండ్ దగ్గర నుంచి కాల్ రికార్డింగ్ యాప్ ఇన్‌స్టాలేషన్ నేర్చుకుని.. భార్య ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేశాడు. ఒక రోజు అతని భార్య బాత్రూంకు వెళ్ళినప్పుడు, చుప్ చాప్‌గా ఆమె ఫోన్‌లో కాల్ రికార్డింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసేశాడు. ఆ తర్వాత, తన భార్య ఎవరితో మాట్లాడినా తనకు తెలుస్తుందని అనుకున్నాడు. అనంతరం కూల్‌గా ఫ్యాక్టరీకి వెళ్లిపోయాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: నోరూరించే పచ్చి చేపల కూర.. కడుపులో మంటతో ఆస్పత్రికి పరుగులు.. ఎక్స్‌రే తీయగా

ఇక డ్యూటీ నుంచి తిరిగొచ్చాక తన భార్య మొబైల్ ఫోన్ తీసుకొని టెర్రస్ మీదకు వెళ్లి, ఆమె ఎవరితో మాట్లాడి ఉంటుందా అని రికార్డింగ్ చెక్ చేయడం మొదలుపెట్టాడు. అటు భార్య ఇంట్లో తన మొబైల్ కనిపించకపోవడంతో, ఆమె దాని కోసం వెతుకుతూ టెర్రస్‌పైకి వెళ్లింది. అక్కడ భర్త తన మొబైల్‌లో రికార్డింగ్ వినడం చూసిన భార్య.. అతడితో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య గొడవ పెద్దది కావడంతో ఆమె.. చపాతీ కర్ర ఇచ్చుకుని అతడ్ని కొట్టడం మొదలుపెట్టింది. ఇంటి నుంచి బయటకు తోసేసి.. ఇకపై ఇంట్లోకి రావద్దని చెప్పింది. భార్య కొట్టడంతో భయపడిన భర్త నేరుగా బితూర్ పోలీస్ స్టేషన్‌‌కు వెళ్ళాడు. అక్కడ అతని ఫిర్యాదు విన్న SHO, అతడి భార్యను పోలీస్ స్టేషన్‌కు పిలిపించాడు. వారిద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పించాడు. అంతేకాకుండా భార్య మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసిన కాల్ రికార్డింగ్ యాప్‌ను తొలగించి.. వారిద్దరి మధ్య రాజీ కుదిర్చారు.

ఇది చదవండి: అయ్యారే.! చిన్నది అనుకునేరు.. స్విచ్ ఆన్ చేస్తే మంచు వర్షం కురవాల్సిందే

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి