Watch: వార్నీ.. ఇదెక్కడి చోద్యం.. టమోటాలకు పోలీస్ బందోబస్తు..! వీడియో చూస్తే అవాక్కే..

|

Oct 20, 2024 | 7:37 AM

ఇదిలా ఉండగా, ప్రస్తుతం మార్కెట్లో టమాటా ఠారెత్తిస్తోంది. కిలో ధర 80 నుండి 120 రూపాయల వరకు పెరిగింది. భారీ వర్షాల కారణంగా పంట నష్టాన్ని దుర్కొన్న స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి.

Watch: వార్నీ.. ఇదెక్కడి చోద్యం.. టమోటాలకు పోలీస్ బందోబస్తు..! వీడియో చూస్తే అవాక్కే..
Police Protection For Tomatoes
Follow us on

ఇంటర్‌నెట్‌లో నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వింత దృశ్యం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న టమోటాలకు పోలీసు సిబ్బంది కాపలాగా నిలుచున్నారు. టమాటాలకు కూడా పోలీస్‌ సెక్యూరిటీ ఏంటని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. వీడియో కూడా వేగంగానే వైరల్‌గా మారింది. అయితే, ఈ వింత ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో వెలుగు చూసింది. కానీ, దీని వెనుక అసలు విషయం వింటే షాక్ అవుతారు. అదేంటంటే..

గురువారం అర్థరాత్రి శివపురి బైపాస్‌ బెంగళూరు నుండి ఢిల్లీకి వెళ్లే మార్గంలో వేగంగా వస్తున్న ట్రక్ మహిళను ఢీకొట్టి బోల్తా పడింది. అర్ధరాత్రి హైవేపై పల్టీలు కొట్టిన ట్రక్కు ఓ పక్కకు ఒరిగిపోయింది. దీంతో లారీలో లోడ్ చేసిన టమోటాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. టమోటాలు రోడ్డున పడ్డాయన్న సంగతి తెలుసుకున్న చుట్టుపక్కల వారు వాటిని ఎత్తుకెళ్లేందుకు హైవేపైకి గుంపులుగా చేరుకున్నారు. అయితే అక్కడున్న పోలీసులు వారిని తరిమికొట్టడంతో వారంతా ఖాళీ చేతులతో వెనుదిరిగారు. అర్ధరాత్రి హైవేపై ట్రక్కు బోల్తా పడటంతో 1800 కిలోల ఎర్రటి టమాటాలను రక్షించడానికి ఏకంగా పోలీసులు కాపలగా ఉండాల్సి వచ్చింది. ఆ మర్నాడు ఉదయం రోడ్డుపై పడివున్న టమాటాలను తొలగించారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా, ప్రస్తుతం మార్కెట్లో టమాటా ఠారెత్తిస్తోంది. కిలో ధర 80 నుండి 120 రూపాయల వరకు పెరిగింది. భారీ వర్షాల కారణంగా పంట నష్టాన్ని దుర్కొన్న స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి