Viral: తెల్లారేసరికి షాప్ తెరిచిన నగల వ్యాపారి.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్‌కి మైండ్ బ్లాంక్
పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఇలా షోరూమ్ తెరిచారో లేదో అలా దూసుకొచ్చారు.. తుపాకీలతో బెదిరించి, విలువైన బంగారు ఆభరణాలు, నగదు పట్టుకొని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు దొంగలను వెంబడించినా దొరకలేదు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. ఆ వివరాలు ఇలా..

బీహార్ ఆరాలో ఉన్న బంగారు నగల షోరూమ్‌ను రోజూలాగే సోమవారం ఉదయం 10 గంటలకు తెరిచారు. కాసేపటికే ఓ పదిమంది దుండగులు తుపాకులతో షాపులోనికి చొరబడ్డారు. దుండగులు ముఖాలు కనిపించకుండా హెల్మెట్లు, మంకీ క్యాప్‌లు ధరించి, తుపాకీలు చేతబట్టి షాపులోనికి దూసుకొచ్చారు. సెక్యూరిటీ వద్ద ఉన్న తుపాకీని లాగేసుకున్నారు. వారి వద్దనున్న ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి షోరూంలోని రూ.25 కోట్ల విలువైన నగలు, డబ్బును దోచుకెళ్లారు. సిబ్బందిలో ఒకరిపై దాడి చేశారు.
ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. దుకాణంలోని సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దుండగులను వెంబడిస్తూ వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు దుండగులు గాయపడ్డారు. అయినా వారు పోలీసులకు చిక్కలేదు. అయితే ఎంత డబ్బు కాజేశారో తెలియాల్సి ఉందని షోరూం మేనేజర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Arrah, Bihar: Six armed criminals looted gold and silver jewelry worth ₹25 crore from a Tanishq showroom in Arrah’s Gopali Chowk. The robbers overpowered staff, locked the shutter and held employees hostage for 30 minutes. Despite multiple calls, police did not respond on time.… pic.twitter.com/oZwiHnr9uL
— IANS (@ians_india) March 10, 2025