Viral Video: ప్రేమ కంటే అందమైన అనుభూతి మరేది ఉండదు. ప్రేమలో ప్రతి క్షణమూ అద్భుతమే. ఈ విషయం ప్రేమలో పడిన ప్రతి ఒక్కరు చెబుతారు. కానీ ఒక వ్యక్తి తన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు అది ఎంతో మరపురాని క్షణం అవుతుంది. సోషల్ మీడియాలో మీరు చాలా రకాల లవ్ ప్రపోజ్‌లు చూసి ఉంటారు. కానీ ఈ రోజు ఓ వ్యక్తి బాస్కెట్ బాల్ కోర్టులో ఓ మహిళా డ్యాన్సర్‌కి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. ఆ సంగతేంటో తెలుసుకుందాం.
వీడియోలో ఒక మహిళ తన బృందంతో కలిసి బాస్కెట్ బాల్ కోర్టులో డ్యాన్స్ చేయడం మనం చూడవచ్చు. వీడియోలో కనిపిస్తున్న మహిళ నిజానికి ఓ జాజ్ డాన్సర్. ఆమె తన అద్భుత నటనను ప్రదర్శిస్తోంది. ఇంతలో ఆమె పార్టనర్ వచ్చి మిడిల్ గ్రౌండ్ లో పెళ్లి ప్రపోజల్ చేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన జాజ్ డాన్సర్ పూర్తిగా ఆశ్చర్యపోయింది. ఆమె ముఖంలో అద్భుతమైన చిరునవ్వు కనిపిస్తుంది.
ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు డేనియల్ బుష్. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే, ప్రజలు తమ అభిప్రాయం తెలియజేయడం ప్రారంభించారు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు లక్షల్లో వీక్షణలు వచ్చాయి. చాలా మంది ఈ వీడియోను చూసి కళ్లలో నీళ్లు తిరిగారని, మరికొందరు అత్యంత అద్భుతమైన ప్రపోజల్ అని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ICYMI: A Utah Jazz dancer received a marriage proposal in the middle of the basketball court ? pic.twitter.com/tLyKlmvcb9
— Reuters (@Reuters) January 2, 2022