Ponytail Ban: అక్కడ పాఠశాలల్లో పోనీ టెయిల్‌ వేసుకోవడం నిషిద్ధం.. ఆ కలర్‌ లోదుస్తులు మాత్రమే ధరించాలి.. కారణమేంటంటే..

|

Mar 13, 2022 | 9:08 AM

అమ్మాయిలు పోనీటెయిల్స్ (Ponytails) వేసుకుంటే ఎంతో అందంగా కనిపిస్తారు. అందుకే చాలామంది ఈ హెయిర్‌ స్టైల్‌ను అనుసరిస్తుంటారు. అయితే ఈ ట్రెండీ హెయిర్‌స్టైల్‌పై ఒక దేశం నిషేధం విధించింది.

Ponytail Ban: అక్కడ పాఠశాలల్లో పోనీ టెయిల్‌ వేసుకోవడం నిషిద్ధం.. ఆ కలర్‌ లోదుస్తులు మాత్రమే ధరించాలి.. కారణమేంటంటే..
Ponytail Ban
Follow us on

అమ్మాయిలు పోనీటెయిల్స్ (Ponytails) వేసుకుంటే ఎంతో అందంగా కనిపిస్తారు. అందుకే చాలామంది ఈ హెయిర్‌ స్టైల్‌ను అనుసరిస్తుంటారు. అయితే ఈ ట్రెండీ హెయిర్‌స్టైల్‌పై ఒక దేశం నిషేధం విధించింది. స్కూళ్లకు వచ్చే అమ్మాయిలు పోనీటెయిల్‌ వేసుకురాకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. అదేదో కాదు మొట్ట మొదట సూర్యుడు ఉదయించే దేశంగా పేరున్న జపాన్‌(Japan) . ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రపంచ దేశాల కంటే ఎంతో మెరుగ్గా ఉన్న ఈ దేశం ఆడపిల్లలపై ఆంక్షలు విధించడంలో మాత్రం ఉత్తర కొరియాను మించిపోయింది. అమ్మాయిల వస్త్రధారణ, హెయిర్‌ స్టైల్స్‌కు సంబంధించి తాజాగా విధించిన ఆంక్షలే ఇందుకు నిదర్శనం. అమ్మాయిలు పోనీటెయిల్‌ వేసుకుని రావడం వల్ల జుట్టు కింద మెడ భాగం బయటకు కనిపిస్తుందని, దీనివల్ల తరగతిలోని విద్యార్థుల దృష్టి మరలిపోతుందని అక్కడి ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. అమ్మాయిల మెడభాగం విద్యార్థులను లైంగికంగా ఉద్రేకపరుస్తుందని అందుకే ఈ కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు జపాన్ అధికారులు చెబుతున్నారు.

తెల్లరంగు లోదుస్తులు మాత్రమే..

కాగా జపాన్‌లోని ఫుకుయోకా ప్రాంతంలోని కొన్ని పాఠశాలల్లో ఇటీవల ఒక సర్వే నిర్వహించారు. పోనీటెయిల్‌ కారణంగా కనిపించే అమ్మాయిల మెడ వల్ల అబ్బాయిలు ఉద్రేకానికి లోనవుతున్నారని ఈ సర్వేలో తేలింది. ఈ కారణంగానే పాఠశాలలకు వెళ్లే ఆడపిల్లలు పోనీటెయిల్ జడ వేసుకొని రావడాన్ని నిషేధించారు. కాగా జపాన్ పాఠశాలల నిబంధనలు అసంబద్ధంగా ఉంటున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు మెడ బయటకు కనిపిస్తుందని పోనీ టెయిల్ నిషేధించిన ప్రభుత్వం.. అదే మెడ బయటకు కనిపించే ఆస్కారమున్న బాబ్ హెయిర్ స్టైల్‌ను మాత్రం అనుమతిస్తోంది. కాగా జపాన్‌లో ఇదొక్కటే కాదు.. అమ్మాయిలకు సంబంధించి చిత్ర విచిత్రమైన నియమాలు, ఆంక్షలు ఉన్నాయి. జపాన్ లోని పాఠశాలలకు వెళ్లే అమ్మాయిల సాక్స్, స్కర్ట్ పొడవుగా ఉండాలి. అదేవిధంగా లోదుస్తులు తెల్లవి మాత్రమే ధరించాలన్న నియమం ఉంది. అంతేకాకుండా జుట్టుకు నలుపు తప్ప ఎలాంటి రంగు వేసుకోకూడదు.

Also Read:Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంపై ఎంత ప్రభావం చూపిందో తెలుసా?

Akhil Akkineni : అయ్యగారి సినిమా పై అక్కినేని అభిమానుల భారీ అంచనాలు..

Shah Rukh Khan: అప్పుడు షారుఖ్‌ను భరించలేకపోయాను.. వదిలేద్దామనుకున్నాను.. గౌరీఖాన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..