Pets Dress: వారెవ్వా ఏం ఐడియా గురూ.. పెంపుడు జంతువుల కోసం వెరైటీ డ్రస్.. దీని ఉపయోగమేంటో తెలుసా?
Wearable Fans: పెంపుడు జంతువులను పెంచుకునే వారు వాటి సంరక్షణ కోసం ఎన్నో వ్యయప్రయాసలు పడుతుంటారు. రకరకాల షాంపూలతో స్నానం చేయిస్తారు, మంచి ఆహారం పెడతారు...
Wearable Fans: పెంపుడు జంతువులను పెంచుకునే వారు వాటి సంరక్షణ కోసం ఎన్నో వ్యయప్రయాసలు పడుతుంటారు. రకరకాల షాంపూలతో స్నానం చేయిస్తారు, మంచి ఆహారం పెడతారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇంట్లో మనుషులను చూసినట్లుగానే వాటి ఆలనాపాలన చూస్తుంటారు. జంతు ప్రేమికుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకునే కొన్ని కంపెనీలు వాటి కోసం రకరకాల ప్రొడక్ట్స్‌ను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జపాన్‌కు చెందిన స్వీట్ మమ్మీ అనే ఓ సంస్థ జంతువుల కోసం ప్రత్యేకంగా ఒక డ్రస్‌ను రూపొందించింది.
సాధారణంగా వేసవిలో మనుషులతో పాటు జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే స్వీట్ మామ్ జంతువుల కోసం ఒక ప్రత్యేక డ్రస్‌ను తయారు చేసింది. నెట్‌లాగా ఉండే ఈ డ్రస్ ద్వారా జంతువుకుల గాలి ధారాళంగా అందుతుంది. అంతేకాకుండా ఈ డ్రస్‌పైన ఒక చిన్న ఫ్యాన్‌ను అమర్చారు. దీంతో జంతువులకు నిత్యం చల్ల గాలి అందుతుంది. స్వీట్ మామ్ కంపెనీ సీఈఓ రీ ఉజావా ఈ ప్రత్యే డ్రస్ గురించి మాట్లాడుతూ.. తన పెంపుడు శునకాన్ని వాక్‌కు తీసుకెళ్లే సమయంలో అవి వేడికి ఇబ్బంది పడడాన్ని గమనించే ఈ డ్రస్ రూపొందించాలనే ఆలోచన వచ్చినట్లు తెలిపారు.
ఈ డ్రస్‌లో ఉండే ఫ్యాన్ బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది. వీటిని శునకాలతో పాటు పిల్లులకు కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం జపాన్‌లో సాయత్రం అయిందంటే చాలు యజమానులు పెంపుడు జంతువులకు ఈ డ్రస్‌లను ధరించి బయటకు వస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..