శీతాకాలం ఆరంభంతోనే జమ్మూ కశ్మీర్ అంతటా తెల్లటి మంచు దుప్పటి పరచుకుంది. ఎటు చూసినా హిమపాతం అందాలు కనువిందు చేస్తున్నాయి. రోడ్లు మంచుతో మూసుకుపోతుండటంతో జోజిలా పాస్ వద్ద శ్రీనగర్-లెహ్ రోడ్డుపై ఇలా ప్రత్యేక వాహనాలతో యంత్రాంగం మంచును తొలగిస్తోంది. ఈ ఏడాది తొలి హిమపాతం ఈ నెల 11 నుంచే మొదలైంది. మంగళవారం కూడా కాశ్మీర్‌లోని కొన్ని ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురిసింది. గుల్‌మార్గ్‌లోని అఫ్రావత్, సోన్‌మార్గ్, గురేజ్, మొఘల్ రోడ్ ప్రాంతాల్లో మూడు నుంచి ఆరు అంగుళాల మేర మంచు కురిసింది. పర్యాటక ప్రాంతాలైన గుల్మార్గ్, సోనామార్గ్ అంగుళాల మేర మంచు పేరుకుపోయింది.
హిమపాతం కారణంగా శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారి, లోయలోని ఎత్తైన ప్రాంతాలలోని ఇతర ముఖ్యమైన రహదారులు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. బందిపోరా-గురేజ్ రహదారి కూడా మూసివేయబడింది. సోమవారం రాత్రి ఈ మార్గంలోని రజ్దాన్ పాస్‌లో మంచు కురుస్తుండటంతో పాటు దృశ్యమానత తక్కువగా ఉండటంతో 16 ట్రక్కులు, నాలుగు సుమో కార్గో వాహనాల్లోని వ్యక్తులు చిక్కుకుపోయారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) సిబ్బంది రాత్రంతా ఆపరేషన్ నిర్వహించి వారిని రక్షించారు.
వీడియో ఇక్కడ చూడండి..
హిమపాతం కారణంగా, అఫ్రావత్‌లోని గోండోలా (కేబుల్ కార్) సేవ కూడా ముందుజాగ్రత్త చర్యగా మూసివేయబడింది. కాగా, మొగల్ రోడ్డుపై కురిసిన మంచును మంగళవారం పీడబ్ల్యూడీ మెకానికల్ వింగ్ ఉద్యోగులు తొలగించారు. పీర్ కి గాలి ప్రాంతంలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించి రోడ్డుపై ఉన్న మంచును తొలగించి చెత్తను కూడా తొలగించారు. మంచు కారణంగా ఈ మార్గంలో 16 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ మార్గం రాజౌరీ-పూంచ్ మీదుగా జమ్మూని కాశ్మీర్‌తో కలుపుతుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..