Watch: 2 గంటల్లో 21 కిలోమీటర్లు పరుగెత్తిన జమ్మూ కశ్మీర్‌ సీఎం.. తొలి అంతర్జాతీయ మారథాన్‌లో రికార్డ్‌..!

|

Oct 21, 2024 | 11:53 AM

మొదటిసారిగా కశ్మీర్‌లో జరిగిన ఈ మారథాన్‌లో ఐరోపా, ఆఫ్రికా క్రీడాకారులతో పాటు 2 వేలకు మందికి పైగా పాల్గొన్నారు. ఈ మారథాన్‌లో పొల్గొన్న సీఎం 2 గంటల్లో 21 కిలోమీటర్ల దురాన్ని పరిగెత్తారు. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే,

Watch: 2 గంటల్లో 21 కిలోమీటర్లు పరుగెత్తిన జమ్మూ కశ్మీర్‌ సీఎం.. తొలి అంతర్జాతీయ మారథాన్‌లో రికార్డ్‌..!
Jammu Kashmir Cm
Follow us on

జమ్మూ కశ్మీర్‌లో అక్టోబర్‌ 20 ఆదివారం తొలి అంతర్జాతీయ మారథాన్ జరిగింది. ఈ మారథాన్‌లో సీఎం ఒమర్‌ అబ్దుల్లా పాల్గొన్నారు. మొదటిసారిగా కశ్మీర్‌లో జరిగిన ఈ మారథాన్‌లో ఐరోపా, ఆఫ్రికా క్రీడాకారులతో పాటు 2 వేలకు మందికి పైగా పాల్గొన్నారు. ఈ మారథాన్‌లో పొల్గొన్న సీఎం 2 గంటల్లో 21 కిలోమీటర్ల దురాన్ని పరిగెత్తారు. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్‌లో హాఫ్ మారథాన్ కోసం వీధుల్లోకి వచ్చి 21 కిలోమీటర్లు నడిచారు. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో తన రన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్‌ చేశారు.

ఆ పోస్ట్‌లో, ‘ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను కశ్మీర్ హాఫ్ మారథాన్ 21 కి.మీ రేసును కిలోమీటరుకు 5 నిమిషాల 54 సెకన్ల వేగంతో పూర్తి చేశాను. నేను నా జీవితంలో 13 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిగెత్తలేదు. అది కూడా ఒక్కసారి మాత్రమే. నాలాంటి ఇతర ఔత్సాహిక రన్నర్‌ల ఉత్సాహంతో ఈరోజు నేను కొనసాగుతూనే ఉన్నాను. సరైన శిక్షణ లేదు, రన్నింగ్ ప్లాన్ లేదు, పోషకాహారం లేదు. దారిలో అరటిపండు, ఒకటి రెండు ఖర్జూరాలు తిన్నామని చెప్పారు.

ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ వాకింగ్‌, రన్నింగ్‌ వంటివి అలవాటు చేసుకోవాలని అబ్దుల్లా ప్రజలకు సూచించారు. మంచి అనుభూతి చెందడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి మందులు అవసరం లేదు. ప్రశాంతంగా పరిగెడితే చాలన్నారు. ఒకసారి ప్రయత్నించండి.. మీరు చింతించరు. మాదక ద్రవ్యాల రహిత జమ్మూ కాశ్మీర్ కోసం పరుగు ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

అందమైన దాల్ సరస్సు ఒడ్డున జరిగిన మారథాన్‌లో ముఖ్యమంత్రి ఇతరులతో కలిసి పరుగెత్తడాన్ని వీడియో రికార్డ్‌ చేశారు. దారిలో ఉత్సహంగా సెల్ఫీలు తీసుకున్నారు. అపాయింట్‌మెంట్ కోసం కూడా ప్రజలు సీఎంను అభ్యర్థించారు. కొందరు జర్నలిస్టులు కూడా తనను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి