Watch: రూ.500 లంచం ఇవ్వలేదని పాస్‌పోర్ట్ చించేసిన పోస్ట్‌మ్యాన్..షాకింగ్ వీడియో వైరల్

ఈ వీడియో వేగంగా వైరల్‌గా మారడంతో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు పోస్ట్‌మ్యాన్ చర్యలను ఖండించారు. పబ్లిక్ సర్వీసెస్‌లో ఉన్న ఇలాంటి వ్యక్తుల వల్లే మన ప్రభుత్వ వ్యవస్థలన్నీ

Watch: రూ.500 లంచం ఇవ్వలేదని పాస్‌పోర్ట్ చించేసిన పోస్ట్‌మ్యాన్..షాకింగ్ వీడియో వైరల్
Postman Tears Passport Over
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 21, 2024 | 10:52 AM

ఓ వ్యక్తి రూ.500 లంచం ఇవ్వడానికి నిరాకరించడంతో ఒక పోస్ట్‌మ్యాన్ ఆ పౌరుడి పాస్‌పోర్ట్ పేజీని చించేశాడు. బాధితుడు పోస్ట్‌మాన్‌ను నిలదీస్తూ రికార్డ్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రతి పోస్ట్‌కు పోస్ట్‌మాన్ రూ.100 డిమాండ్ చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో లక్నోలో చోటు చేసుకుంది.

బాధిత వ్యక్తి పోస్ట్‌మ్యాన్‌పై అధికారికంగా ఫిర్యాదు చేశాడు. సంఘటన, అతని పాస్‌పోర్ట్‌కు జరిగిన నష్టాన్ని వివరించాడు. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించి మరిన్ని ఆధారాలను సేకరించేందుకు పోస్టాఫీసులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పోస్టాఫీసులో జరిగిన ఈ ఘటన ప్రజాసేవల్లో అవినీతిపై తీవ్ర దుమారం రేపింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఈ వీడియో వేగంగా వైరల్‌గా మారడంతో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు పోస్ట్‌మ్యాన్ చర్యలను ఖండించారు. పబ్లిక్ సర్వీసెస్‌లో ఉన్న ఇలాంటి వ్యక్తుల వల్లే మన ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయంటూ, అవినీతికి వ్యతిరేకంగా బలమైన, కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు పెద్ద సంఖ్యలో పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి