జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో గండేర్‌బల్ నియోజకవర్గం బాగూ రాంపొరాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటేసిన తొలి ముగ్గురు ఓటర్లు ఆ పోలింగ్ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ముగ్గురు మూడు మొక్కలు నాటి పర్యావరణ స్ఫూర్తిని చాటారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
గండేర్‌బల్ అసెంబ్లీ స్థానం నుంచి జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత ఒమర్ అబ్దుల్లా బరిలో ఉన్నారు. ఆయనతో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బషీర్ అహ్మద్ తలపడుతున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతన్నాయి. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఈ వీడియోపై క్లిక్ చేయండి..
#WATCH | J&K Assembly elections: First three voters at a polling station in Bagoo Rampora of Ganderbal constituency, plant saplings after casting their vote.
JKNC vice president Omar Abdullah is contesting from here where he is facing a contest from PDP’s Bashir Ahmad Mir. pic.twitter.com/69S7MYpyS1
— ANI (@ANI) September 25, 2024
ఈ నెల 18 తొలి విడత ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. ఇవాళ సెప్టెంబర్ 25న రెండో విడత పోలింగ్ జరుగుతోంది. అక్టోబర్ 1న మూడో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. జమ్ముకశ్మీర్‌లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకుగాను తొలి విడతలో 24 స్థానాలకు పోలింగ్ జరిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..