Kumari Aunty: కుమారీ అంటీ స్టోరీపై ‘నెట్‌ఫ్లిక్స్‌’లో డాక్యుమెంటరీ.. అసలు నిజమిదే.!

సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ తరుణంలో.. ఎవ్వరు.? ఎందుకు.? ఫేమస్ అవుతున్నారో అస్సలు తెలియట్లేదు. చిన్న డైలాగ్ చెప్పో.. లేదా డ్యాన్స్ స్టెప్ వేసో.. లేదా ఒక వీడియో తీసో.. ఇలా ఇంటర్నట్‌లో వైరల్ కావడం.. ఆ తర్వాత సోషల్ మీడియాలో ట్రెండింగ్.. ఆ వెంటనే మీడియా కవరేజ్.. సినిమా స్టార్స్ ప్రమోషన్స్‌.. కట్ చేస్తే..

Kumari Aunty: కుమారీ అంటీ స్టోరీపై నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీ.. అసలు నిజమిదే.!
Kumari Aunty Food

Updated on: Feb 06, 2024 | 11:51 AM

సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ తరుణంలో.. ఎవ్వరు.? ఎందుకు.? ఫేమస్ అవుతున్నారో అస్సలు తెలియట్లేదు. చిన్న డైలాగ్ చెప్పో.. లేదా డ్యాన్స్ స్టెప్ వేసో.. లేదా ఒక వీడియో తీసో.. ఇలా ఇంటర్నట్‌లో వైరల్ కావడం.. ఆ తర్వాత సోషల్ మీడియాలో ట్రెండింగ్.. ఆ వెంటనే మీడియా కవరేజ్.. సినిమా స్టార్స్ ప్రమోషన్స్‌.. కట్ చేస్తే.. ఓవర్‌నైట్‌లో సూపర్ ఫేం వచ్చేస్తోంది. అలా ఈరోజుల్లో తెగ వైరల్ అయింది ‘కుమారీ అంటీ’.

ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడకు చెందిన ఈ మహిళ.. గత 13 ఏళ్లుగా మాదాపూర్‌లోని దుర్గంచెరువు దగ్గర ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ నడుపుతోంది. తక్కువ ధరకే రుచికరమైన భోజనాన్ని అందిస్తూ.. స్థానికంగా బాగా ఫేమస్ అయింది. ఇక ఆమెకు సంబంధించిన ఓ వీడియో.. అందులోని ఒక చిన్న డైలాగ్ విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో.. చాలామంది ప్రజలు కుమారీ అంటీ స్టాల్ వద్దకు వెళ్లడం ప్రారంభించారు. జనాల తాకిడి ఎక్కువ కావడం.. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడంతో.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కుమారీ అంటీ స్టాల్‌ను అక్కడ నుంచి తొలగించాలని ఆర్డర్ జారీ చేశారు.

కథలో ట్విస్ట్ ఇప్పుడు వచ్చింది.. దీనికి సోషల్ మీడియా వేదికగా ఆమెకు సపోర్ట్ చేస్తూ.. అందరూ కవరేజ్ చేశారు. విషయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్లింది. ఆమె అక్కడే బిజినెస్ చేసుకోవచ్చునని.. త్వరలోనే తాను వచ్చి కలుస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో.. రాష్ట్రమంతటా కుమారీ అంటీ హాట్ టాపిక్ అయిపోయింది.

ఈ క్రమంలోనే ఆమె గురించి ఇప్పుడొక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్.. కుమారీ అంటీ స్టోరీపై మూడు ఎపిసోడ్స్‌తో ‘ఫేమ్’ అనే టైటిల్ పెట్టి ఓ డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తోందని దాని సారాంశం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ట్వీట్ చేసిన సదరు ట్విట్టర్ పేజి.. ఇది కేవలం ఫన్ కోసం క్రియేట్ చేసిన మీమ్ మాత్రమేనని.. నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి డాక్యుమెంటరీ ప్లాన్ చేయట్లేదని వెల్లడించింది.