ఫింగర్ ప్రింట్ ఉపయోగించి చనిపోయిన వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేయడం సాధ్యమేనా..?

|

May 27, 2023 | 4:27 PM

మరణానంతరం శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పును ఫోరెన్సిక్ నిపుణులు మాత్రమే గుర్తించగలరు. మృతదేహాన్ని ల్యాబ్‌లో పరిశీలించిన తర్వాత వేలిముద్రలలో మార్పును గుర్తించగలుగుతారు. అయితే, చనిపోయిన వ్యక్తి వేలిముద్రను ఉపయోగించి అతని స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చా?

ఫింగర్ ప్రింట్ ఉపయోగించి చనిపోయిన వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేయడం సాధ్యమేనా..?
Fingerprint Facts F
Follow us on

ప్రతి మనిషిలోనూ ఎవరి ప్రత్యేకత వారికే ఉంటుంది.. వ్యక్తుల ప్రవర్తన, వారి అలవాట్లు కొంత వరకు ఒకేలా ఉన్నప్పటికీ, ఏ ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ ఒకేలా ఉండలేరు. అలాగే అందరి వేలిముద్రలు కూడా భిన్నంగా ఉంటాయి. అంతేకాదు.. ఒక వ్యక్తిలోని ఫింగర్‌ ప్రింట్లు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక వ్యక్తి గుర్తింపును ధృవీకరించడానికి వేలిముద్రలు ఉపయోగిస్తారు. పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్‌తో సహా అనేక అధికారిక పత్రాల మీద వేలిముద్ర సమాచారం తప్పనిసరిగా ఉంటుంది. అంతేకాదు.. స్మార్ట్‌ఫోన్ లాక్‌ల కోసం కూడా వేలిముద్రలు ఉపయోగిస్తుంటారు చాలా మంది. ఫింగర్‌ప్రింట్స్‌ వ్యక్తిగత గుర్తింపు, భద్రతలో సహాయపడతాయి. అయితే ఒక వ్యక్తి చనిపోతే వారి వేలిముద్రలు ఉపయోగించవచ్చా? అంటే మరణం తర్వాత గుర్తింపు కోసం వారి వేలిముద్రలను ఉపయోగించడం సాధ్యమేనా? ఇక్కడ తెలుసుకుందాం..

ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని వేలిముద్రలు ఒకేలా ఉండవు. మరణానంతరం శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అటువంటి పరిస్థితిలో వేలిముద్రలు పొందడం చాలా కష్టం. మరణం తరువాత శరీరంలో విద్యుత్ వాహకత ఆగిపోతుంది. మన శరీరంలోని కణాలు క్రమంగా పనిచేయడం మానేస్తాయి. దాంతో మరణం తర్వాత మనిషి వేలిముద్రలు మారుతాయి. ఈ మార్పును ఫోరెన్సిక్ నిపుణులు మాత్రమే గుర్తించగలరు. మృతదేహాన్ని ల్యాబ్‌లో పరిశీలించిన తర్వాత వేలిముద్రలలో మార్పును గుర్తించగలుగుతారు. అయితే, చనిపోయిన వ్యక్తి వేలిముద్రను ఉపయోగించి అతని స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చా?

ఒక వ్యక్తి మరణించిన తర్వాత వేలిముద్రలను ఉపయోగించి అతని స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేయలేము. దీని వెనుక శాస్త్రీయ కారణం ఉంది. మీరు ఫోన్ వేలిముద్ర స్కానర్‌పై ఆ వేలిని ఉంచినప్పుడు, విద్యుత్ వాహకత ఫోన్ సెన్సార్‌కు వేలిముద్ర సమాచారాన్ని అందిస్తుంది. మరణం తరువాత, విద్యుత్ ప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది. ఈ కారణంగా ఫోన్ అన్‌లాక్ చేయలేము.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..