Viral News: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక అంశం వైరల్ అవుతూనే ఉంటుంది. దాదాపు అయితే, కామెడీ సీన్స్, జంతువులు, ప్రకృతికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతాయి. అయితే, తాజాగా ఓ ఐపీఎస్ అధికారి ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితి ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయన పరిస్థితిని తెలుసుకుని సోషల్ మీడియా యూజర్లంతా నవ్వుకుంటున్నారు. మరి ఇంతకీ ఆ ఐపీఎస్ అధికారి ఎదర్కొన్న విచిత్ర పరిస్థితి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ప్రతీది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. ఒడిశా రవాణా కమిషనర్ అరుణ్ బోత్రా జైపూర్ విమానాశ్రయానికి చేరుకోగానే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఆయన బ్యాగ్‌ని తనిఖీ చేశారు. బ్యాగ్ తెరవగానే అందులో పచ్చి బఠానీలు ఉన్నాయి. ఇది చూసిన భద్రతా సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. అయితే, ఈ తనిఖీలకు సంబంధించిన ఫోటోలను, తాను ఎదుర్కొన్న పరిస్థితిని అరుణ్ బోత్రా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అది పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. అరుణ్ బోత్రా ట్వీట్‌ను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. అయ్యో పాపం అంటూ స్మైల్ ఎమోజీలు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 5,5000 మందికి పైగా నెటిజన్లు లైక్ చేశారు. వేలాది కామెంట్స్ చేశారు.
కాగా, అరుణ్ బోత్రా తాను జైపూర్‌లో కిలో 40 రూపాయల చొప్పున కొన్ని పచ్చి బఠానీ కాయలను కొనుగోలు చేశానని ట్వీ్ట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు మరికొందరు ప్రభుత్వాధికారులు కూడా స్పందించారు. ఐఎఎస్ అధికారి అవ్నీష్ శరణ్ కూడా తన అనుభవాన్ని పంచుకున్నారు. ఒకప్పుడు తాను పొట్లకాయ, వంకాయలు తీసుకెళ్తూ విమానాశ్రయంలో రెండు వేల రూపాయలు ఫైన్ చెల్లించానని చెప్పుకొచ్చారు. ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రవీణ్ కస్వాన్ స్పందిస్తూ.. ఇదేదో బఠానీ స్మగ్లింగ్ లా ఉందంటూ సరదాగా కామెంట్ చేశారు. ఇలా అరుణ్ బోత్రా ట్వీట్ నవ్వులు పూయిస్తుంది.
Security staff at Jaipur airport asked to open my handbag ? pic.twitter.com/kxJUB5S3HZ
— Arun Bothra ?? (@arunbothra) March 16, 2022
Also read:
Puzzle Picture: ఈ ఫోటోలో ఒక వీరుడు దాగున్నాడు.. ఎక్కడ ఉన్నాడో కనిపెట్టగలరా?
Viral Video: దెయ్యమే ఆ పని చేసిందా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న షాకింగ్ వీడియో..!
Spinal Cord Surgery: వైద్య చరిత్రలో మరో అద్భుతం.. బాలుడికి పునర్జన్మనిచ్చిన డాక్టర్స్..!