దోశ తిందామని వెళ్లిన ఐపీఎస్ అధికారికి ఊహించని షాక్.. ఏం జరిగిందంటే

|

May 10, 2023 | 8:09 AM

దొంగలు ఎప్పుడు ఎలా మాయ చేస్తారో ఎవరికి అర్థం కాదు. తాజాగా ఓ ఐపీఎస్ అధికారికి రెస్టారెంట్‌లో అలాంటిదే చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల అరుణ్ బోత్రా అనే ఐపీఎస్ అధికారి దోశ తినేందుకు ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఓ దోశకు ఆర్డర్ ఇచ్చారు. ఆయన టిఫిన్ చేసిన తర్వాత వెయిటర్ బిల్లు ఇచ్చాడు.

దోశ తిందామని వెళ్లిన ఐపీఎస్ అధికారికి ఊహించని షాక్.. ఏం జరిగిందంటే
Dosa
Follow us on

దొంగలు ఎప్పుడు ఎలా మాయ చేస్తారో ఎవరికి అర్థం కాదు. తాజాగా ఓ ఐపీఎస్ అధికారికి రెస్టారెంట్‌లో అలాంటిదే చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల అరుణ్ బోత్రా అనే ఐపీఎస్ అధికారి దోశ తినేందుకు ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఓ దోశకు ఆర్డర్ ఇచ్చారు. ఆయన టిఫిన్ చేసిన తర్వాత వెయిటర్ బిల్లు ఇచ్చాడు. కానీ బిల్లులో రెండు దోశలకు డబ్బు కట్టాలని ఉంది. దీంతో ఆ అధికారి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇలా ఎందుకు జరిగిందని వెయిటర్‌ను అడగ్గా మరో టేబుల్ వద్ద కూర్చున్న వ్యక్తి ఈ దోశను ఆర్డరిచ్చాడని చెప్పాడు. ఐపీఎస్ అధికారితో రెస్టారెంట్‌కు వచ్చానని అతడు చెప్పినట్టు వెయిటర్ ఆయనకు వివరించాడు. ఇది విన్న ఆ అధికారి ఒక్కసారిగా కంగుతిన్నాడు. అయితే, ఐపీఎస్ అధికారి పేరిట దోశ ఆర్డరిచ్చిన ఆ వ్యక్తి అప్పటికే అక్కడి నుంచి జారుకున్నాడు

ఆ ఐపీఎస్ అధికారి తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ సోమవారం ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది ఈ ఉదంతంపై కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరికొందరు సరదాగా సెటైర్లు వేస్తున్నారు. ఐపీఎస్ అధికారికి మస్కా కొడుతున్న విషయం ఆ దొంగకు తెలుసా అంటూ మరికొందరు ప్రశ్నించారు. అలాగే మరికొందరు మిమ్మల్ని అడగకుండా ఆ వెయిటర్ అతడికి దోశ ఎందుకు ఇచ్చారంటూ అడిగారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..