వామ్మో.. తొందరపడి నూడుల్స్‌ తింటున్నారా..? తెలియక చేసిన తప్పుతో 13ఏళ్ల బాలుడు మృతి..

13 ఏళ్ల బాలుడు ఆకలితో పచ్చి నూడుల్స్ తిన్నాడు. ఒక్కసారి కాదు, మూడు నూడుల్స్ ప్యాకెట్లు తిన్నాడు. అంతలోనే అతనికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. అతని కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్చినప్పటికీ, వైద్యులు అతన్ని కాపాడలేకపోయారు. WHO మార్గదర్శకాల ప్రకారం, ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి రోజుకు గరిష్టంగా 2000mg సోడియం తీసుకోవాలి. కానీ,

వామ్మో.. తొందరపడి నూడుల్స్‌ తింటున్నారా..? తెలియక చేసిన తప్పుతో 13ఏళ్ల బాలుడు మృతి..
Instant Noodles Dangers

Updated on: Sep 03, 2025 | 2:14 PM

ఆకలిగా ఉన్నప్పుడు తక్షణం తయారు చేసుకుని తినగలిగే స్నాక్స్‌లో నూడుల్స్ ఒకటి. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే స్నాక్ ఫుడ్‌ ఐటమ్. అయితే, మీరు కూడా నూడుల్స్‌ని ఎక్కువగా తింటున్నారా..? తినడానికి ముందు మీకో అలర్ట్‌..అదేంటంటే.. వాటిని సరిగా ఉడికించకుండా లేదా సగం ఉడికించి నూడుల్స్‌ తినడం మీ ఆరోగ్యానికి ప్రమాదకరం! లేదంటే అనేక సమస్యలు తలెత్తుతాయి. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. అవును మీరు చదివింది నిజమే ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఈజిప్టులో జరిగిన ఒక భయంకరమైన సంఘటన సగం ఉడికిన నూడుల్స్‌ తినడం ఎంత ప్రమాదకరమో చెప్పింది. 13 ఏళ్ల బాలుడు ఆకలితో పచ్చి నూడుల్స్ తిన్నాడు. ఒక్కసారి కాదు, మూడు నూడుల్స్ ప్యాకెట్లు తిన్నాడు. అంతలోనే అతనికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. అతని కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్చినప్పటికీ, వైద్యులు అతన్ని కాపాడలేకపోయారు.

WHO మార్గదర్శకాల ప్రకారం, ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి రోజుకు గరిష్టంగా 2000mg సోడియం తీసుకోవాలి. కానీ, ఒక ప్యాకెట్ ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో దాదాపు 1829mg సోడియం ఉంటుంది. అంటే మీరు రోజుకు రెండు ప్యాకెట్ల నూడుల్స్ తింటే శరీరంలో అవసరమైన దానికంటే ఎక్కువ సోడియం పేరుకుపోతుంది. ఇది నేరుగా రక్తపోటు పెరగడానికి, గుండెకు హాని కలిగించడానికి దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా, ముడి నూడుల్స్ త్వరగా జీర్ణం కావు. దీనివల్ల జీర్ణవ్యవస్థలో సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో మధుమేహం, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముడి నూడుల్స్ శరీరంలోని నీటి పరిమాణాన్ని తగ్గిస్తాయి. ఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..