
రైతే రాజు అన్న నానుడి అందరికీ తెలిసిందే. రైతు లేకపోతే అసలు మనిషికి తిండే లేదన్నది జగమెరిగిన సత్యం. రైతులు ఎప్పుడూ కూడా పొలంలో దుక్కి దున్నుతూ చెమటోడ్చి కష్టపడుతూనే ఉంటారు. అయితే, ఇక్కడో రైతు చేసిన వెరైటీ ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పొలంలో మొక్కల మధ్య ఎప్పటికప్పుడు కలుపు తీయటం అనేది రైతులకు పరిపాటి. లేకపోతే, ఆ కలుపు పంటను నాశనం చేస్తుంది. కానీ, కలుపు తీయాలన్నా, పండ్లు కోయాలన్నా పెద్ద పని. అందుకోసం నడుం వంచి పొద్దస్తమానం కష్టపడాల్సి ఉంటుంది. అదీనూ వంగుని పనిచేయడం మరింత కష్టం. అందుకే ఈ రైతు కత్తిలాంటి ఐడియా ట్రై చేశాడు.
చూస్తున్నారుగా, హాయిగా పడుకొనే పొలం పనులు చేసుకుంటున్నాడు. తన మంచాన్నే అందుకు అనుకూలంగా మార్చేసుకున్నారు. నాలుగు వైపులా చక్రాలను అమర్చి.. దాన్ని పొలంలోకి తీసుకెళ్లి.. దానిపై బోర్లా పడుకొని ఎంచక్కా పనులు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ‘వాట్ ఏ ఐడియా సర్ జీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:
ఈ ఆహార పదార్ధాలను పెరుగుతో పాటు అస్సలు తినకూడదు.! చాలా డేంజర్.. అవేంటంటే..
దట్టమైన అడవిలో ఊగుతూ కనిపించిన మర్మమైన బొమ్మ.. గగుర్పొడిచే దృశ్యం.. చివరికి ట్విస్ట్ ఏంటంటే.?