AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అందమైన అమ్మాయి తన రోజువారి పనులు నెట్‌లో షేర్‌ చేసింది..! మిలియన్ల వ్యూస్‌తో వీడియో వైరల్‌..

ఇషా వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇషా మంచి భార్యగా ప్రూవ్ చేసుకుంటుందని చాలా మంది అంటున్నారు. అదే సమయంలో, పర్వత జీవితాన్ని పరిచయం చేసినందుకు చాలా మంది ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కాకుండా, చాలా మంది ఆమె కామెంట్ బాక్స్‌లో పెళ్లికి ప్రపోజ్ చేస్తున్నారు.

Watch: అందమైన అమ్మాయి తన రోజువారి పనులు నెట్‌లో షేర్‌ చేసింది..! మిలియన్ల వ్యూస్‌తో వీడియో వైరల్‌..
Womans Daily Routine
Jyothi Gadda
|

Updated on: Sep 26, 2024 | 1:11 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు కనిపిస్తున్నాయి. వీటిని ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. వీటిలో కొన్ని వీడియోలు మనకు పెద్దగా తెలియని వ్యక్తుల జీవితాలను పరిచయం చేస్తుంటాయి. అటువంటి వీడియో ఒకటి its_me_isha39 అనే ఖాతా నుండి షేర్‌ చేయబడింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వేగంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేసిన ఇషా.. తనను తాను అభివర్ణించుకున్న విధానం నెటిజన్లను కట్టిపడేలా కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఇషా పర్వత ప్రాంతంలో నివసిస్తుంది. అక్కడ తన జీవితంలోని అనేక వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 13 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు. ఈ వీడియోలో ఎత్తైన కొండప్రాంతంలో ఉన్న తన ఇంట్లో తను చేసే రోజువారీ పనులను వివరించింది.

ఇవి కూడా చదవండి

వీడియోలో ఇషా ఒక పెద్ద బుట్టను పట్టుకుని అడవికి బయల్దేరుతుంది. పర్వతాలలో నివసించే ప్రజలకు కావాల్సిన ఆహారం, నిత్యావసరాలను సేకరించడానికి ఇటువంటి బుట్టలు అవసరమని ఇషా చెబుతుంది.ఆ తరువాత ఆమె ఆవు పేడతో పిడకలు చేస్తుండటం చూపించింది. ఈ పేడతో ఆమె ఎరువులు తయారు చేస్తానని చెప్పింది. కట్టెల పొయ్యిపై వంట చేస్తుంది. అంతేకాదు ఆవు పాలు పిండేందుకు కూడా వెళ్లాలని వివరించింది. ఇలా గ్రామీణ ప్రాంతంలోని ప్రజల జీవన శైలి ఎలా ఉంటుందో.. అటువంటి వ్యవసాయ పనులు సహా అన్ని రకాల పనులు చేస్తూ వీడియోను చిత్రీకరించిన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్త వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇషా వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇషా మంచి భార్యగా ప్రూవ్ చేసుకుంటుందని చాలా మంది అంటున్నారు. అదే సమయంలో, పర్వత జీవితాన్ని పరిచయం చేసినందుకు చాలా మంది ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కాకుండా, చాలా మంది ఆమె కామెంట్ బాక్స్‌లో పెళ్లికి ప్రపోజ్ చేస్తున్నారు. ప్రముఖ కంటెంట్ సృష్టికర్త ఇషాకు సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులు ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..