Azadi Ka Amrit Mahotsav: దేశభక్తి ఉప్పొంగేవేళ..ఖరీదైన కారుకు జాతీయ జెండా రంగులు…

|

Aug 15, 2022 | 12:52 PM

ఎందరో మహానుభావుల పోరాటం, వారి త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం (Independence) వచ్చింది. తెల్ల వాళ్ల పాలన నుంచి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి మన దేశానికి విముక్తి లభించింది. అప్పటి నుంచి ఏటా ఘనంగా...

Azadi Ka Amrit Mahotsav: దేశభక్తి ఉప్పొంగేవేళ..ఖరీదైన కారుకు జాతీయ జెండా రంగులు…
Flag Painting Video
Follow us on

ఎందరో మహానుభావుల పోరాటం, వారి త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం (Independence) వచ్చింది. తెల్ల వాళ్ల పాలన నుంచి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి మన దేశానికి విముక్తి లభించింది. అప్పటి నుంచి ఏటా ఘనంగా జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఈ ఏడాదితో 75 వసంతాలను పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరవేయాలన్న ప్రధాని మోదీ (PM Modi) ప్రకటనతో.. దేశంలోని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగరవేస్తున్నారు. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఓ వ్యక్తి వినూత్నంగా తన దేశభక్తని చాటుకున్నారు. ఖరీదైన కారుకు జాతీయ జెండా రంగులు వేయించి, కుటుంబంతో సహా ఢిల్లీ వరకు హర్‌ ఘర్‌ తిరంగా ప్రచారం చేపట్టారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన సిద్ధార్థ జోషి.. తన ఖరీదైన జాగ్వార్ కారుకు జాతీయ జెండా రంగులు వేయించారు. కారు బోనెట్‌తోపాటు డోర్లపై ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’, ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార లోగోలను పెయింట్‌ వేయించారు. ఇందు కోసం రూ.రెండు లక్షలు ఖర్చు చేశారు.

కారును అందంగా ముస్తాబు చేసిన అనంతరం అందులో కుటుంబ సమేతంగా దేశ రాజధాని ఢిల్లీకి పయనమయ్యారు. సూరత్‌ నుంచి 1,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీని రెండు రోజుల్లో చేరుకున్నారు. పార్లమెంట్‌ వద్ద కారుతో చక్కర్లు కొట్టారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలుసుకోవాలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టారు. త్రివర్ణ పతాకం రంగుల్లో ఉన్న ఈ కారు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమదైన శైలిలో కామెంట్లు రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..