IND vs ENG: క్రికెట్ కోసం ప్రియురాలిని త్యాగం చేసిన యువకుడు.. నెట్టింట వైరల్..

|

Jul 08, 2022 | 7:36 PM

Ind vs Eng: ఒక యువకుడు స్టేడియంలో ఓ పోస్టర్ పట్టుకుని కనిపించాడు. దీంతో మరోసారి క్రికెట్‌ అంటే అభిమానులు ఎంతగా ఇష్టపడతారో చెప్పుకోవచ్చు. ఆ యువకుడి చేతిలో ఓ ప్లకార్డు ఉంది. దానిపై రాసి ఉన్న దాన్ని చూసిన నెటిజన్లు, తమ కామెంట్లతో తెగ వైరల్ చేస్తున్నారు.

IND vs ENG: క్రికెట్ కోసం ప్రియురాలిని త్యాగం చేసిన యువకుడు.. నెట్టింట వైరల్..
Ind Vs Eng Poster Boy
Follow us on

India vs England 1st T20: ప్రపంచంలో అత్యంత ఇష్టమైన క్రీడలలో ఒకటిగా క్రికెట్ పేరుగాంచింది. సౌతాంప్టన్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన మొదటి T20 ఇంటర్నేషనల్ సమయంలో, ఒక యువకుడు స్టేడియంలో ఓ పోస్టర్ పట్టుకుని కనిపించాడు. దీంతో మరోసారి క్రికెట్‌ అంటే అభిమానులు ఎంతగా ఇష్టపడతారో చెప్పుకోవచ్చు. ఆ యువకుడి చేతిలో ఓ ప్లకార్డు ఉంది. దానిపై రాసి ఉన్న దాన్ని చూసిన నెటిజన్లు, తమ కామెంట్లతో తెగ వైరల్ చేస్తున్నారు.

ఆ యువకుడి చేతిలో ఉన్న ప్లకార్డుపై- నా ప్రియురాలు నేను కావాలా? లేదా క్రికెట్ కావాలా? అని అడిగింది. కానీ, నేను క్రికెట్‌ను ఎంచుకుని ఇక్కడ ఉన్నాను’ అంటూ రాసి ఉంది. క్రికెట్ కోసం ప్రియురాలిని పక్కన పెట్టి లైవ్ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి చేరుకున్నాడు. సరే.. నీలా కనిపించే వ్యక్తికి గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉందంటే ఆశ్చర్యంగా ఉందంటూ కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే కొంత మంది దీన్ని సమర్థిస్తూ.. అది తప్పని అంటూ కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టెస్టులో ఓటమి నుంచి కోలుకున్న భారత జట్టు 50 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించిందంటూ, అందుకోసమే క్రికెట్ అంటే ఎక్కువగా ఇష్టమంటూ చెప్పుకొచ్చారు. హాఫ్ సెంచరీతో పాటు 4 వికెట్లు తీసిన హార్దిక్ పాండ్య మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ రేపు అంటే జులై 9న బర్మింగ్‌హామ్‌లో జరగనుంది.