Watch Video: భారీ సిక్సర్ బాదిన హిట్‌మ్యాన్.. పెవిలియన్‌లో చిన్నారికి తాకిన బంతి.. వైరల్ వీడియో..

|

Jul 13, 2022 | 8:10 AM

డేవిడ్ విల్లీ వేసిన ఓవర్ మూడో బంతికి రోహిత్ శర్మ బలమైన సిక్సర్ కొట్టాడు. అయితే, ఆ బంతి ఒక చిన్న పాప పాలిట బాధను మిగిల్చింది.

Watch Video: భారీ సిక్సర్ బాదిన హిట్‌మ్యాన్.. పెవిలియన్‌లో చిన్నారికి తాకిన బంతి.. వైరల్ వీడియో..
Rohit Six Viral Video
Follow us on

తొలి మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ(Rohit Sharma), శిఖర్ ధావన్ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ శర్మ ఆరంభం నుంచి దూకుడుగా కనిపించాడు. భారత కెప్టెన్ రోహిత్ 58 బంతుల్లో 76 పరుగులతో అజేయంగా ఆడాడు. ఈ క్రమంలో అతను 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. రోహిత్ కొట్టిన ఒక సిక్స్ ఓ చిన్న అభిమానిని మాత్రం బాగా డిస్టబ్ చేసింది. 5వ ఓవర్‌లో డేవిడ్ విల్లీ వేసిన మూడో బంతికి రోహిత్ బలమైన షాట్ కొట్టాడు. బంతి నేరుగా ప్రేక్షకుల మధ్య ఉన్న స్టాండ్‌లోకి పడింది. అయితే, బంతి ఓ చిన్న పాపకి తగిలింది. బంతి తగిలిన వెంటనే ఆ అమ్మాయి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

పరిక్షీంచిన ఇంగ్లీష్ టీమ్ డాక్టర్..

ఇవి కూడా చదవండి

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన ఒడిలోకి తీసుకొని చిన్న అభిమానిని ఏడుపును కంట్రోల్ చేసేందుకు ట్రై చేస్తుండడం వీడియోలో చూడొచ్చు. ఈ ఘటనతో మ్యాచ్ కాసేపు ఆగింది. రోహిత్‌తో సహా మైదానంలో ఉన్న ఆటగాళ్లందరి దృష్టి కూడా అమ్మాయి వైపే పడింది. స్టేడియంలో ఉన్నవారంతా బాలిక గురించి ఆందోళన చెందారు. హడావుడిగా, ఇంగ్లీష్ టీమ్‌లోని ఫిజియో, డాక్టర్లు బాలికను పరీక్షించడానికి పరిగెత్తారు.

రోహిత్, ధావన్ భారీ భాగస్వామ్యం..

ఈ సంఘటన జరిగిన కొన్ని నిమిషాల తర్వాత మ్యాచ్ మొదలైంది. రోహిత్ తన తుఫాన్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఇంగ్లిష్ బౌలర్లను రోహిత్ భీకరంగా చిత్తు చేశాడు. మరో ఎండ్‌లో శిఖర్‌ ధావన్‌ కూడా అతడికి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి మధ్య 114 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొంది. రోహిత్ 49 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్, ధావన్ మధ్య 18వ సెంచరీ భాగస్వామ్యంగా నిలిచింది. అంతకుముందు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతం చేయడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు సత్తా చాటలేకపోయారు.

బుమ్రా, షమీ పదునైన బౌలింగ్..

బుమ్రా 19 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి 110 పరుగులకు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కట్టడి చేశారు. దీంతో భారత్ 19 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. జాసన్ రాయ్, జో రూట్, లియామ్ లివింగ్‌స్టన్, జానీ బెయిర్‌స్టో, బ్రైడన్ కార్స్, డేవిడ్ విల్లీలను బుమ్రా తన బాధితులను చేసుకున్నారు. బుమ్రాతో పాటు మహ్మద్ షమీ 31 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.