క్రికెట్ లో ఇలాంటివన్నీ సాధ్యమే.. స్లిప్ కార్డన్ లో 9మంది ఫీల్డర్లు.. వీడియో చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే

|

Oct 11, 2022 | 6:39 AM

ప్రపంచంలో ఉన్న అన్ని రకాల క్రీడల్లో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలా మంది ప్రజలు ఈ క్రీడను చాలా ఇష్టపడుతుంటారు. అంతే కాకుండా ఆ ఆటను ఆడేందుకు, చూసేందుకు ఆసక్తి...

క్రికెట్ లో ఇలాంటివన్నీ సాధ్యమే.. స్లిప్ కార్డన్ లో 9మంది ఫీల్డర్లు.. వీడియో చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే
Cricket Video Viral
Follow us on

ప్రపంచంలో ఉన్న అన్ని రకాల క్రీడల్లో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలా మంది ప్రజలు ఈ క్రీడను చాలా ఇష్టపడుతుంటారు. అంతే కాకుండా ఆ ఆటను ఆడేందుకు, చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. క్రికెట్ లో టెస్టు, వన్డే, టీ-ట్వంటీ సిరీస్ లు నడుస్తుంటాయి. అంతే కాదు.. క్రికెట్ లో జరిగినన్ని వింతలు, విచిత్రాలు మరే ఆటలోనూ జరలేదనే చెప్పాలి. సాధారణంగా క్రికెట్ జట్టులో పదకొండు మంది క్రీజ్ లో ఆడుతుంటారు. బౌలింగ్ చేసే జట్టు తరఫున అందరూ గ్రౌండ్ లోకి దిగితే.. బ్యాటింగ్ చేస్తున్న టీమ్ నుంచి ఇద్దరు ప్లేయర్లు ఆడతారన్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా క్రికెట్‌లో ఫీల్డింగ్‌ ప్రముఖపాత్ర పోషిస్తుంది. మ్యాచ్‌ గెలుపోటములు ఫీల్డింగ్‌ పైనే ఆధారపడి ఉంటుంది. బ్యాటింగ్ చేస్తున్న వారిని కట్టడి చేసేందుకు కెప్టెన్‌ ఫీల్డింగ్‌ను ఏర్పాటు చేస్తాడు. అయితే, స్లిప్‌ కార్డన్‌లో ఒకరు లేదా ఇద్దరు ఫీల్డర్లను ఏర్పాటు చేయడం మనం చూసే ఉంటాం. కానీ ఓ టీ20 మ్యాచ్‌లో స్లిప్‌ కార్డన్‌లో ఏకంగా 9 మంది ఫీల్డర్లను ఏర్పాటు చేయడం మాత్రం మీరెప్పుడూ చూసి ఉండరు. ఈ అరుదైన ఘటన యురోపియన్‌ క్రికెట్‌ లీగ్‌లో జరిగింది.

నార్వే, రొమానియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. రొమానియా జట్టు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో నార్వే జట్టు స్లిప్‌ కార్డన్‌లో ఏకంగా 9 మంది ఫీల్డర్లను ఉంచింది. అయినప్పటికీ బ్యాటర్‌ ఫీల్డర్ల మధ్యలో నుంచి షాట్‌ ఆడి రెండు పరుగులు సాధించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు, క్రికెట్‌ అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. 10 ఓవర్ల నిడివి కలిగిన ఈ మ్యాచ్‌లో నార్వే జట్టు ఘన విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

మొదట బ్యాటింగ్‌ చేసిన నార్వే 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రీజులోకి దిగిన రొమానియా లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 54 పరుగులు మాత్రమే చేసింది. అయితే, మ్యాచ్‌ పూర్తిగా తమ చేతుల్లోకి వచ్చిందని భావించిన నార్వే జట్టు కెప్టెన్‌.. ఈ రకంగా వినూత్నంగా ఫీల్డింగ్‌ను ఏర్పాటు చేశాడు.