Viral Video: సింహంపై గుంపుగా హైనాల ఎటాక్.. చావు దాకా వెళ్లింది.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్.!

| Edited By: Anil kumar poka

Sep 15, 2021 | 8:41 PM

Lion Attack Video: ''నాన్నా.. పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది ''.. ఈ సినిమా డైలాగ్ సింహం పంజా పవర్‌కు ప్రతీక. అడవికి రారాజు సింహం...

Viral Video: సింహంపై గుంపుగా హైనాల ఎటాక్.. చావు దాకా వెళ్లింది.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్.!
Lion
Follow us on

”నాన్నా.. పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది ”.. ఈ సినిమా డైలాగ్ సింహం పంజా పవర్‌కు ప్రతీక. అడవికి రారాజు సింహం అని మనదరికీ తెలుసు. మృగరాజు వేట అత్యంత భయానకంగా ఉంటుంది. దేన్నైనా క్షణాల్లో వెంటాడి.. వేటాడేస్తుంది. అలాంటి సింహాన్ని గుంపుగా వచ్చిన హైనాలు ఓ ఆట ఆడుకున్నాయి. సింగిల్‌గా ఉన్న సింహం బలం.. మా ముందు పనికిరాదన్నట్లుగా చుక్కలు చూపించాయి. అందుకు సంబంధించిన వైరల్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం దానిపై ఓ లుక్కేయండి..

వైరల్ వీడియో ప్రకారం.. ఒంటరిగా ఉన్న ఓ సింహాన్ని గుంపుగా వచ్చిన హైనాలు చుట్టుముడతాయి. అసలే హైనాలు సర్వభక్షకాలు.. బ్రతికున్న.. చచ్చినా.. తమ ఎరను గుంపుగా పీక్కు తింటాయి. అవి ఏ జంతువును వేటాడాలన్నా గుంపుగానే వేటాడతాయి. అలాంటి క్రూరమైన జంతువులకు సింహం ఒంటరిగా చిక్కింది. ఇంకేముంది.. మొత్తం అన్నీ కలిసి దాన్ని చుట్టుముట్టాయి. క్షణాల్లో దాన్ని చంపి తినేయాలని ప్రయత్నించాయి. అయితే ఇక్కడే వాటికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది.

తన స్నేహితుడిని కాపాడుకోవడానికి మిగతా సింహాలు అక్కడికి చేరుకున్నాయి. హైనాలపై విరుచుకుపడ్డాయి. దొరికినదాన్ని.. దొరికినట్లుగా వేటాడాయి. అంతే అవి తోక ముడుచుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాయి. ఈ వీడియోను ‘Nature’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ పోస్ట్ చేయగా.. అప్‌లోడ్ అయిన క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ వీడియోను పోస్ట్ చేయగా.. హైనాలు సింహం వెనుక ఎందుకు పడ్డాయో వివరించారు. ఈ సంఘటన కెన్యాలోని మారా ఒలాపో క్యాంప్‌లో చోటు చేసుకుంది. దీనిని ఇప్పటిదాకా 6 లక్షల మందికి పైగా వీక్షకులు వీక్షించారు.

Read Also: బ్యాంకు ఎకౌంట్లోకి లక్షలు.. మోడీ పంపించారట.. తిరిగి ఇవ్వనంటూ మడత పేచీ! ఈ స్టోరీ వింటే నవ్వాలో.. జాలిపడాలో అర్ధం కాదు..

వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్

కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే

వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్