
అడవిలో మనుగడ సాగించడం అంటే నిరంతరం పోరాటమే. ఆహారం కోసం వేటాడే క్రమంలో కొన్నిసార్లు క్రూర జంతువులే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. తాజాగా ఒక ఆఫ్రికన్ రాక్ పైథాన్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. తన శరీరం తట్టుకోలేనంత పెద్ద జంతువును మింగేసిన ఆ కొండచిలువ, చివరకు దానిని జీర్ణించుకోలేక ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఈ క్లిష్ట సమయంలో ఒక వ్యక్తి జోక్యం చేసుకుని ఆ పాము ప్రాణాలను కాపాడటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది చదవండి: ఇది చిటికెడు వేస్తే చాలు.. మందార మొక్కకు వచ్చే తెల్లని పురుగులను తరిమి కొట్టొచ్చు..
ఆఫ్రికన్ రాక్ పైథాన్‌లు శక్తివంతమైన కొండచిలువలు. ఇవి చిన్నపాటి జింకలు, కోతులు, అడవి పందులను కూడా అలవోకగా మింగేయగలవు. కానీ, కొన్నిసార్లు వేట పరిమాణం అంచనా వేయడంలో ఇవి పొరబడతాయి. ఒకవేళ మింగిన జంతువు చాలా పెద్దగా ఉంటే లేదా దాని కొమ్ములు శరీరానికి గాయాలు చేస్తున్నట్లయితే, పాములు తమను తాము రక్షించుకోవడానికి ఆ ఆహారాన్ని వెలగక్కుతాయి. దీనివల్ల వాటి జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తగ్గి, వేగంగా పారిపోవడానికి వీలవుతుంది.
ఈ ఘటనలో కూడా, ఆ పైథాన్ ఒక పెద్ద జంతువును మింగి కదలలేని స్థితిలో ఉంది. దాని శరీరం ఆ బరువుకు తట్టుకోలేక ఇబ్బంది పడుతుండటం గమనించిన ఒక వ్యక్తి, చాకచక్యంగా దానికి సాయం చేశాడు. అతని జోక్యం వల్ల ఆ పైథాన్ సురక్షితంగా ఆ జంతువును బయటకు వెలగక్కగలిగింది. సాధారణంగా అడవి జంతువుల విషయంలో మానవ జోక్యం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తారు, కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో ఇలాంటి సహాయం ఆ జీవులకు ప్రాణదానం అవుతుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓ సారి చూసేయండి.
ఇది చదవండి: 33 సిక్సర్లు, 47 ఫోర్లతో ఊహకందని ఊచకోత.! వెంట్రుక పీకలేరంటూ సర్పంచ్ సాబ్ ఊదిపడేశాడుగా