Viral Video: అట్లుంటది మరి.. డ్రమ్ము కొట్టిన కోళ్లు.. ఆశ్చర్యపోతున్న మ్యూజిక్ లవర్స్

Chickens play drums: కోళ్లకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసి మ్యూజిక్ లవర్స్.. బీటు బాగుందంటూ స్టెప్పులేస్తున్నారు.

Viral Video: అట్లుంటది మరి.. డ్రమ్ము కొట్టిన కోళ్లు.. ఆశ్చర్యపోతున్న మ్యూజిక్ లవర్స్
Chickens Play Drums

Updated on: Jul 15, 2022 | 1:56 PM

Chickens play drums: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా.. కోళ్లకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసి మ్యూజిక్ లవర్స్.. బీటు బాగుందంటూ స్టెప్పులేస్తున్నారు. అయితే.. మీరెప్పుడైనా కోళ్లు డ్రమ్స్ వాయిస్తే ఎలా ఉంటుందో ఆలోచించారా? లేకపోతే.. ఈ వీడియో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అలాంటి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. అయితే.. ఈ వీడియోలో ఓ వ్యక్తి కోళ్లతో డ్రమ్స్ ఎలా కొట్టిస్తున్నాడో చూసి ఆశ్చర్యపోతున్నారు.

వైరల్ వీడియోలో రెండు డ్రమ్ముల ముందు రెండు కోళ్లు నిలబడి ఉన్న దృశ్యాన్ని చూడవచ్చు. అయితే.. బోంగో డ్రమ్స్‌ మీద ఆ వ్యక్తి డ్రమ్స్‌పై ఆహార గింజలను ఉంచుతాడు. దీంతో ఆ కోళ్లు వేగంగా గింజలను తింటాయి. అవి తింటుండగా.. అచ్చం డ్రమ్ములతో బీటు కొట్టినట్లు శబ్ధం వినిపిస్తుంది. ఈ శబ్ధం మనోహరంగా ఉందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

వాస్తవానికి ఈ వీడియోను మొదట టిక్‌టాక్‌లో, తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. యానిమల్స్ డూయింగ్ థింగ్స్ animalsdoingthings అనే ఇన్‌స్టా పేజీ ఈ వైరల్ వీడియోను షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసి బాగుందంటూ నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి