Viral Video: ఇంట్లోకి దూరిన భారీ పైథాన్.. ఆ తర్వాత ఒళ్లు గగుర్పొడిచే సీన్..

|

Dec 08, 2024 | 1:51 PM

సరీసృపాలలో కొండచిలువ, అనకొండ లాంటి జీవులు.. ఆకారంలోనే కాదు.. పొడవులోనూ భారీగా ఉంటాయని అంటారు. సరీసృపాలలో అవే భారీగా ఉంటాయి. ఈ తరహ ఘటన తాజాగా.. ఆ వివరాలు ఇలా..

Viral Video: ఇంట్లోకి దూరిన భారీ పైథాన్.. ఆ తర్వాత ఒళ్లు గగుర్పొడిచే సీన్..
Python
Follow us on

మన ఊహకందని అనూహ్య సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సరీసృపాలు.. తమ ఆవాసాలను విడిచిపెట్టి.. జనావాసాల్లోకి రావడం సర్వసాధారణమైపోయింది. ఫ్రిడ్జ్ డోర్ తీస్తే పాములు రావడం, ఏసీ డెక్‌లో పాము.. బెడ్ కింద నల్లులు.. ఇలా వింత ఘటనలు మనం సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ తరహ ఘటన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇది చదవండి: పుష్ప 2 మూవీలో ఈ హీరోయిన్ ఎవరో తెల్సా.. బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

ఇవి కూడా చదవండి

ఓ ఇంటి సీలింగ్ నుంచి వింత శబ్దాలు రావడంతో.. ఆ సీలింగ్ పగలగొట్టి చూడగా.. ఊహించని షాక్ ఎదురైంది ఆ కుటుంబానికి. ఈ ఘటన మలేషియాలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆ కుటుంబం ఇంటి సీలింగ్ నుంచి వింత శబ్దాలు రావడాన్ని గుర్తించారు. అవి విపరీతంగా పెరుగుతూపోతుండటంతో.. అనుమానమొచ్చి సీలింగ్ పరిశీలించగా.. 20 అడుగులు పొడవున్న భారీ సైజులో పైథాన్ ఒకటి బయటపడింది. దాన్ని చూడగానే అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వెంటనే రెస్క్యూ టీంకి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని అతికష్టం మీద సీలింగ్ నుంచి దాన్ని బయటకు తీశారు. అది సుమారు 80 కిలోల బరువు ఉందని తెలిపారు. అనంతరం దాన్ని బంధించి.. సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ దానిపై ఓ లుక్కేయండి.

కొండచిలువలు సుమారు 200 కిలోల బరువు వరకు ఉంటాయి. అలాగే 30 ఏళ్ల వరకు జీవిస్తాయని చెప్తారు. సరీసృపాలలో కొండచిలువ, అనకొండ భారీ సైజు, పొడవు ఉంటాయని అంటుంటారు.

ఇది చదవండి: ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటని చూడగా

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..