
ఒక్కసారి మీ బాల్యాన్ని గుర్తు చేసుకోండి. ఇంజక్షన్ చేయింకోవాలంటే మీరు ఎన్ని గంతులు వేసి ఉంటారో కదా.. అయితే ఇప్పటికి మీలో కొందరు ఇంజెక్షన్ అంటే ఎందుకో తెలియని భయంతో ఉంటారు. మరి ఇంజెక్షన్ చేయడానికి చిన్న పిల్లలతో ఎలా వ్యవహరించాలి..? శిశువైద్యులు లేదా పిల్లల డాక్టర్ పిల్లల దృష్టిని మళ్లించి ఇంజెక్షన్ ఇస్తారు. మరి పిల్లల దృష్టిని మళ్లించడానికి వారు ఏమేం చేస్తారో తెలుసుకుంటే మనకు తెలియకుండానే నవ్వుకుంటాం. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అందులో పిల్లల వైద్యుడు ఓ బేబీకి ఇంజెక్షన్ చేసేందుకు చేసిన పనులు తప్పక నవ్విస్తాయి మిమ్మల్ని.
దీనికి సంబంధించిన వీడియోను శిశువైద్యుడు డాక్టర్ సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇంకా దానికి కాప్షన్ ‘ఆరు నెలల కంటే తక్కువ ఉన్నవారే నయం, మేము పెద్దవాళ్లం.. పిరికివాళ్లం’ అని రాసుకొచ్చాడు. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 9.8 లక్షల మందికి పైగా నెటిజన్లు చూశారు. ఇంకా ఈ వీడియోకు వారు అనేక విధాలుగా స్పిందిస్తున్నారు.
వీడియో మీ కోసం..
”డాక్టర్ కావాలనుకునే మా మామయ్య కూతురికి ఈ వీడియో చూపించాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆమె చాలా స్ఫూర్తి పొందింది. ఆమె మీలాగే ఉండాలని కోరుకుంటుంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘మీ అద్భుతమైన పనికి ధన్యవాదాలు సార్’ అని మరొకరు అన్నారు. ఇలా నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..